spot_img
Homeక్రీడలుక్రికెట్‌Sunrisers Leeds Abrar Ahmed Auction: సన్ రైజర్స్ మాత్రమే కాదు.. ఎందెందు చూసినా పాక్...

Sunrisers Leeds Abrar Ahmed Auction: సన్ రైజర్స్ మాత్రమే కాదు.. ఎందెందు చూసినా పాక్ క్రికెటర్లే!

Sunrisers Leeds Abrar Ahmed Auction: పాకిస్తాన్ అంటే చాలు మన దేశంలో విపరీతమైన చర్చ నడుస్తుంది. ఇక క్రికెట్ కు సంబంధించిన వ్యవహారం అయితే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తాయి. అనేక సంచలన విజయాలు దర్శనమిస్తాయి. అటువంటిదే ఇది కూడా.

Also Read: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘అల్లు సినిమాస్’..తెలుగు వాళ్లంటే అంత చులకనా?

క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ దేశంలో ది హండ్రెడ్ లీగ్ నిర్వహణ కోసం ఇటీవల వేలం నిర్వహించారు. ఈ వేళలో పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ ను సన్ రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు చేసింది. ఇది కాస్త సంచలనంగా మారింది. సన్ రైజర్స్ గ్రూపులో ఉన్న ఈ జట్టు అహ్మద్ ను ఏకంగా 2.34 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది కాస్త సామాజిక మద్యమాలలో రకరకాల చర్చలకు కారణమైంది.

అయితే హైదరాబాద్ జట్టు యాజమాన్యం అహ్మద్ ను కొనుగోలు చేయడాన్ని హెడ్ కోచ్ డేనియల్ వెటోరి సమర్థించుకున్నాడు. అహ్మద్ బౌలింగ్లో వైవిధ్యం ఉంటుందని.. లోకల్ ప్లేయర్లు అతడి బౌలింగ్ స్టైల్ ను అంత ఈజీగా అంచనా వేయలేరని వెల్లడించాడు. వేలంలో ఎన్నో ఆప్షన్స్ ఉన్నప్పటికీ.. తాము అబ్రార్ ను కొనుగోడు చేసినట్టు వెల్లడించాడు.

ఐపీఎల్ తెరపైకి వచ్చిన తర్వాత.. అనేక దేశాలు క్రికెట్ లీగ్ లు నిర్వహిస్తున్నాయి. అయితే అందులో భారత ఫ్రాంచైజీలలో పాకిస్తాన్ ప్లేయర్లు ఉన్నారు. సన్ రైజర్స్ లీడ్స్ లో అహ్మద్ ఉండడం ఒక రకంగా సంచలనమైనప్పటికీ.. భారత ఫ్రాంచైజీలలో పాకిస్తాన్ ప్లేయర్లు ఉండడం ఇదే ఫస్ట్ టైం కాదు. కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యం లోని ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు ఉస్మాన్ తారిక్ ను తీసుకుంది. ఇక మెజార్ క్రికెట్ లీగ్ లో ఢిల్లీ జట్టుకు చెందిన సీటల్ ఓర్కాస్ జట్టు ఈమాద్ వసీం ను తీసుకుంది. ఐఎల్ టి20 లీగ్ లో ఈమాద్ వసీం ను అబుదాబి జట్టు తీసుకుంది..

ది 100 లీగ్ లో యార్క్ షైర్ జట్టు ప్రధానమైంది. ఇందులో 51 శాతం వాటాను కావ్య మారన్ ఆధ్వర్యంలోని సన్ టీవీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఫలితంగా నార్తర్ను సూపర్ చార్జర్స్ జట్టు సన్ రైజర్స్ లీడ్స్ గా రూపాంతరం చెందింది. ఫలితంగా భారత ఫ్రాంచైజీలలో కొనసాగుతున్న పాకిస్తాన్ ప్లేయర్ల గురించి.. చర్చ నడుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version