Trivikram , Puri Jagannadh
Trivikram and Puri Jagannadh : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లు ఉన్నవాళ్లకు మాత్రమే ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది దర్శకులు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అసలు సక్సెస్ లు కూడా లేని హీరోలతో సినిమాలను చేసి వాళ్లకు భారీ విజయాలను కట్టబెట్టి వారిని కూడా స్టార్ హీరోలుగా మారుస్తూ ఉంటారు. కానీ ఆయా దర్శకులు కొంతవరకు డౌన్ అయినప్పుడు ఆ హీరోలు వాళ్ళని ఆదుకోవడంలో మాత్రం ఎలాంటి సహాయం చేయరు. ఇక పూరి జగన్నాధ్ లాంటి దర్శకుడు వరుసగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయిన తర్వాత మహేష్ బాబు లాంటి హీరోతో పోకిరి (Pokiri) అనే సినిమా చేసి ఇండస్ట్రి హిట్ కట్టబెట్టాడు. నిజానికి పోకిరి కి ముందు మహేష్ బాబుకి స్టార్ హీరో ఇమేజ్ అయితే లేదు. కానీ పోకిరి సినిమాతో ఒకసారి గా ఇండస్ట్రీని చెక్ చేయడంతో ఆయన మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకోవడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను కూడా క్రియేట్ చేశారు. ఇక ఆ తర్వాత బిజినెస్ మేన్ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించాడు. మరి ఇలాంటి పూరి జగన్నాధ్ కి మహేష్ బాబు మాత్రం అవకాశాన్ని ఇవ్వడం లేదు.
Also Read : మహేష్ బాబు, పూరి జగన్నాధ్ మధ్య ఏం జరిగింది..? వీళ్ళ కాంబో కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారా..?
పూరి జగన్నాధ్ తో సినిమా చేసే సమయం తనకు లేదు అన్నట్టుగా మహేష్ బాబు వ్యవహరిస్తున్నాడు. మరి వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ ఈగో క్లాశేష్ వచ్చాయో తెలియదు కానీ మహేష్ బాబు ఇతర దర్శకులందరికి అవకాశాన్ని ఇస్తూ పూరి జగన్నాథ్ ను పక్కన పెట్టడంతో ఇటు పూరి అభిమానులు, అటు మహేష్ అభిమానులు తీవ్రమైన మనస్థాపానికి గురవుతున్నారు.
ఎందుకంటే మహేష్ బాబు లో ఉన్న పూర్తి పొటెన్షియాలిటీని బయటికి తీయాలి అంటే అది పూరి వాళ్ళనే అవుతుంది. అందువల్లే మహేష్ ఆయనతో సినిమాలు చేస్తే బాగుంటుందంటూ ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా రాకపోవచ్చు… త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడు సైతం టాప్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అల్లు అర్జున్ మీడియం రేంజ్ హీరోగా కొనసాగుతున్నాడు.
ఇక అతనికి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం లో అనే మూడు వరుస బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను అందించి తనను స్టార్ హీరోగా మార్చాడు. ఇప్పుడు త్రివిక్రమ్ కి పాన్ ఇండియా మార్కెట్ లేదనే ఉద్దేశ్యంతో అతన్ని పక్కనపెట్టి అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఇదంతా చూస్తున్న అభిమానులు మాత్రం అల్లు అర్జున్ కి కృతజ్ఞత భావం లేదు అంటూ భారీ ఎత్తున అతనిపైన కామెంట్లైతే చేస్తున్నారు…