https://oktelugu.com/

Madugula Halwa : ఈ హల్వా ను తింటే.. శోభనం రోజు పెళ్ళికొడుకు రేసుగుర్రమే..

Madugula Halwa : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని(Andhra Pradesh state) ఉమ్మడి విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలోని మాడుగుల(Madugula) అనే మారుమూల గ్రామం ఉంది.

Written By: , Updated On : March 21, 2025 / 09:42 AM IST
Madugula Halwa

Madugula Halwa

Follow us on

Madugula Halwa : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని(Andhra Pradesh state) ఉమ్మడి విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలోని మాడుగుల(Madugula) అనే మారుమూల గ్రామం ఉంది. ఈ గ్రామంలో గత 130 సంవత్సరాల క్రితమే హల్వా(Halwa) అనే వంటకం తయారు చేయడం మొదలైంది. మొదట్లో ఈ స్వీట్ ను తయారు చేయడానికి ఒక కుటుంబం సరదాగా మొదలుపెట్టింది. ఆ తర్వాత అది క్రమక్రమంగా విస్తరించింది. మాడుగుల అంటేనే హల్వాకు ప్రసిద్ధి అనేలాగా ఎదిగిపోయింది. ఫలితంగా మాడుగుల గ్రామం హల్వాకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. మార్కెట్లో ఎన్ని రకాల హల్వాలు వచ్చినా మాడుగులకు ఉన్న ప్రత్యేకతే వేరు అనే లాగా స్థిరపడిపోయింది. విశాఖపట్నం జిల్లాకు దగ్గర్లోనే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో నాణ్యమైన జీడిపప్పు లభిస్తుంది. అక్కడి నుంచే హల్వా తయారుదారులు జీడిపప్పును దిగుమతి చేసుకుంటారు. నెయ్యిని కూడా స్వయంగా తయారు చేసుకుంటారు. హల్వాను తయారు చేయడానికి నాణ్యమైన బెల్లాన్ని వాడుతారు. బెల్లం కూడా అనకాపల్లి ప్రాంతం నుంచి తెచ్చుకుంటారు. అందులో ఎటువంటి రసాయనాలు ఉపయోగించరు. కృత్రిమ రంగులను కూడా వాడరు. కట్టెల పొయ్యి మీదనే.. ఇనుప పేనాలను వాడుతుంటారు. హల్వా తయారు చేయడానికి దాదాపు నాలుగు రోజులపాటు సమయం తీసుకుంటారు. హల్వా తయారు చేసే ప్రక్రియలో నైపుణ్యం ఉన్న పాక శాస్త్ర నిపుణులకు మాత్రమే ఆ బాధ్యత అప్పగిస్తారు. నైపుణ్యం లేని వారిని హల్వా తయారు చేసిన తర్వాత.. ప్యాకింగ్ చేసే పని అప్పగిస్తారు.

Also Read : బడ్జెట్ హల్వా వేడుకలో హల్వా నిజంగా తయారు చేస్తారా.. దానిలో ఏయే పదార్థాలు ఉపయోగిస్తారు?

విదేశాలకు ఎగుమతి

మాడుగుల ప్రాంతంలో తయారుచేసిన హల్వా కు మనదేశంలోనే కాదు, విదేశాల్లోనూ విపరీతమైన క్రేజీ ఉంటుంది. ఇక్కడ తయారైన హల్వా లో 25% విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. జీడిపప్పు ధర పెరిగినా.. బెల్లం ధర పెరిగినా.. నెయ్యి తయారీ ఖర్చు పెరిగినా.. నాణ్యత విషయంలో మాత్రం తయారీదారులు ఏ మాత్రం రాజీపడరు. హల్వాను ప్రత్యేకంగా తయారుచేసి.. తమ నైపుణ్యాన్ని చాటుకుంటారు. శోభనం రోజున పెళ్ళికొడుకు మాడుగుల హల్వా తింటే.. పడక గదిలో రేసుగుర్రం లాగా రెచ్చిపోతాడని ఇక్కడి పెద్దలు సరదాగా అంటుంటారు. శోభన వేడుక సమయంలో పెళ్ళి కొడుకుకు స్నేహితులు లేదా దగ్గర బంధువులు మాడుగుల హల్వాను బహుమతిగా ఇస్తుంటారంటే దీని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి, తిరునాళ్ల సమయంలో మాడుగుల హల్వాకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీనిని తమ బంధువులకు, స్నేహితులకు ఇవ్వడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. నెలల ముందే భారీగా ఆర్డర్లు ఇస్తుంటారు. ఇక ఇటీవల కాలంలో కార్పొరేట్ కంపెనీలు దీపావళి సందర్భంగా తమ ఉద్యోగులకు స్వీట్ ప్యాకెట్లకు బదులు మాడుగుల హల్వాను ఇవ్వడం పెరిగిపోయింది. మాడుగుల హల్వా కు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. వీటిని ఇతర ప్రాంతాలకు పంపించే ప్రక్రియను కూడా కొంతమంది వ్యాపారంగా మార్చుకున్నారు అంటే అతిశయోక్తి కాక మానదు. డిమాండ్ ఎంతగా ఉన్నప్పటికీ.. తయారీదారులు ఇప్పటికి హల్వాను తయారు చేసే ప్రక్రియకు నాలుగు రోజులపాటు సమయం తీసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హడావుడిగా హల్వాను తయారు చేయరు. హల్వా తయారీకి కూడా ప్రత్యేకమైన వంట చెరుకును ఉపయోగిస్తారు. ప్రత్యేకంగా ఇనుప పేనాలను హల్వా తయారీకి వాడుతుంటారు.

Also Read : నేటి నుంచి అజ్ఞాతంలోకి ఆర్థిక మంత్రి.. తిరిగి కనిపించేది ఆ రోజే