IPL trophy 2025
IPL trophy 2025 : గత సీజన్లో కోల్ కతా జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ను ఓడించి సుదీర్ఘ విరామం తర్వాత ట్రోఫీని అందుకుంది. కోల్ కతా జట్టు విజేతగా గత సీజన్లో ఆవిర్భవించిన నేపథ్యంలో.. ఈ సీజన్లో ఆ జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో కోల్ కతా జట్టు తొలి మ్యాచ్ మార్చి 22న సాయంత్రం 7:30 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా బెంగళూరు జట్టుతో తలపడనుంది. గత సీజన్లో బెంగళూరు జట్టుతో కోల్ కతా జట్టు రెండుసార్లు తలపడింది. రెండుసార్లు కూడా కోల్ కతా జట్టే విజేతగా నిలిచింది.. గత సీజన్లో కోల్ కతా జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించాడు. జట్టును అన్ని రంగాలలో ముందుండి నడిపించాడు. అయితే గత ఏడాది జరిగిన మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ ను రిటైన్ చేసుకోవడానికి కోల్ కతా జట్టు యాజమాన్యం అంతగా ఆసక్తి చూపించలేదు. దీంతో అతడిని పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. ప్రస్తుతం పంజాబ్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు..కోల్ కతా జట్టుకు అజంక్యా రహనే కెప్టెన్ గా ఉన్నాడు.
Also Read : మిగతా జట్ల లాగా.. SRH కు కూడా కెప్టెన్ ను మార్చేస్తే..
ఒక్క ట్రోఫీ కూడా దక్కించుకోకపోవడంతో..
ఐపీఎల్ ప్రస్తుతం 18వ ఎడిషన్ లో అడుగు పెట్టింది. 2008 నుంచి గత సీజన్ వరకు ఆడిన పంజాబ్ జట్టు ఇంతవరకు ఒక్క ట్రోఫీ కూడా దక్కించుకోలేదు. యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ లాంటి ఆటగాళ్లు నాయకత్వం వహించినప్పటికీ పంజాబ్ జట్టు విజేతగా నిలవలేకపోయింది. ఇప్పుడు పంజాబ్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నాడు. కోచ్ గా రికీ పాంటింగ్ వ్యవహరిస్తున్నాడు. అయితే ఈసారి విజేతగా నిలవాలని పంజాబ్ జట్టు భావిస్తోంది. ఇందులో భాగంగానే పంజాబ్ జట్టు కోచ్ రికీ పాంటింగ్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రకరకాల ప్రణాళికలు అమలు చేయడం మొదలుపెట్టారు. ప్రాక్టీస్ కూడా ఇప్పటికే ప్రారంభించారు. ఇక టీం కోచ్ రికీ పాంటింగ్, ఇతర కోచింగ్ సిబ్బంది, ప్లేయర్లు పూజలు నిర్వహించడం మొదలుపెట్టారు. జట్టు ఆటగాళ్ల సమక్షంలో అర్చకులు హోమం కూడా నిర్వహించారు. మరి ఈ పూజతో నైనా పంజాబ్ జట్టు తలరాత మారుతుందా? హోమం తో నైనా ఈసారి ట్రోఫీ దక్కించుకుంటుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. పంజాబ్ జట్టు పూజలు పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈసారైనా పంజాబ్ జట్టు విజేతగా నిలవాలని.. ట్రోఫీని గెలుచుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయ్యర్ గత ఏడాది కోల్ కతా జట్టును విజేతగా నిలిపాడని.. ఇప్పుడు పంజాబ్ జట్టు ను కూడా విజేతగా నిలుపుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read : చెన్నై సొంత మైదానంలో ఆడే మ్యాచ్లు ఇవే..