spot_img
Homeఆధ్యాత్మికంToday 14th March 2026 Horoscope: ఈ రాశుల వారికి శని దేవుడి అనుగ్రహం.. వద్దన్నా...

Today 14th March 2026 Horoscope: ఈ రాశుల వారికి శని దేవుడి అనుగ్రహం.. వద్దన్నా డబ్బు..

Today 14th March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై ఉత్తరాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశులపై శని దేవుడి అనుగ్రహం ఉండడం వల్ల సమయానికి అనుకున్న పనులు పూర్తవుతాయి. మరో రెండు రాశుల వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు పనులన్నీ సకాలంలో పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు అనేక ప్రయోజనాలు కలగలు ఉన్నాయి. ఆర్థికంగా బలపడతారు. గతంలో చేపట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో గతంలో కంటే ఎప్పుడూ లాభాలు పొందుతారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీరికి తోటి ఉద్యోగుల సపోర్టు ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాతులకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఎవరైనా వీరి పనులకు ఆటంకాలు సృష్టించినా కూడా అవి ముందుకు వెళుతూనే ఉంటాయి. కష్టపడిన దానికి తగిన ఫలితం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఇలాంటి సమయంలో పెద్దలను సంప్రదించాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : విద్యార్థుల కెరీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అనుకున్న ప్రాజెక్టులు సమయానికి పూర్తి చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు పొందుతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఇంట్లో జరిగే శుభకార్యానికి సిద్ధమవుతారు. దాన ధర్మాలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పై చదువుల కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్నేహితుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని ప్రతికూలమైన వాతావరణం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దలను సంప్రదించాలి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉండలు ఉన్నాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్నేహితులతో సరదాగా ఉంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు వాదనలకు దిగకుండా ఉండాలి. ఎందుకంటే ప్రతికూలమైన వాతావరణం వీరికే ఎదురయ్యే అవకాశం ఉంటుంది. శత్రువుల నడవడికపై కన్నేసి ఉంచాలి. వ్యాపారులు కొందరి చేష్టల వల్ల మోసపోయే అవకాశం ఉంది. డబ్బు విషయంలో ఎవరితోనూ వాదనలకు దిగకుండా ఉండాలి. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో కలిసి విఆర్ యాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణముంటుంది. ఓ శుభకార్యం కోసం అందరూ బిజీగా మారిపోతారు. వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనాలు ఉండనున్నాయి కొత్తగా పెట్టుబడులు పెడతారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు శని దేవుడి అనుగ్రహం ఉండనుంది. దీంతో వీరికి ఆదాయం పెరుగుతుంది. గతంలో కంటే ఎప్పుడు ఉత్సాహంగా పని చేయగలుగుతారు. ఇష్టమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version