https://oktelugu.com/

IPL trophy 2025 : ఐపీఎల్ రూల్స్ మారుతున్నాయి.. బౌలర్లకు వికెట్ల పండగే

PL trophy 2025 : ఐపీఎల్ అంటేనే దూకుడుకు పర్యాయపదం. బాదుడుకు నానార్థం. బౌలర్లపై బ్యాటర్లు విరుచుకుపడే సందర్భం. అందువల్లే ఐపిఎల్ అంటే బౌలర్లు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోతారు.

Written By: , Updated On : March 21, 2025 / 08:45 AM IST
IPL trophy 2025

IPL trophy 2025

Follow us on

IPL trophy 2025 : ఐపీఎల్ అంటేనే దూకుడుకు పర్యాయపదం. బాదుడుకు నానార్థం. బౌలర్లపై బ్యాటర్లు విరుచుకుపడే సందర్భం. అందువల్లే ఐపిఎల్ అంటే బౌలర్లు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోతారు. బ్యాటర్లు కొడుతుంటే చూస్తూ ఉండిపోతారు. ఎంత పెద్ద తోపు బౌలర్లు అయినప్పటికీ.. ప్లాట్ మైదానాల మీద వికెట్ల తీయలేక చేతులెత్తేస్తుంటారు. గత సీజన్లో బెంగళూరు, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు పరుగుల వరద పారింది. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఆ సమయంలో రవిచంద్రన్ అశ్విన్ ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లో బౌలర్లను ఆ దేవుడే కాపాడాలంటూ తన బాధను ట్వీట్ రూపంలో వెల్లడించాడు. అయితే ఇన్నాళ్లకు బీసీసీఐ బౌలర్ల మొర ఆలకించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరగబోయే సీజన్లో కీలక నిర్ణయం తీసుకున్నట్టు స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అయితే దీనిపై ఇంతవరకు బిసిసిఐ అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ.. జరుగుతున్న పరిణామాలు మాత్రం బౌలర్లకు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read : ఈసారి అయినా గెలిపించు దేవా.. పంజాబ్ కింగ్స్ హోమం వైరల్

ఐపీఎల్ నిబంధనలపై..

ఇప్పటివరకు ఐపీఎల్లో నిబంధనలు బ్యాటర్లకు అనుకూలంగానే ఉండేవి. ప్రతి మ్యాచ్ లోనూ ప్లాట్ పిచ్ ఏర్పాటు చేసేవారు. దీనివల్ల బ్యాటర్లు పండగ చేసుకునేవారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయేవారు. ఎంత పెద్ద బౌలర్లు అయినప్పటికీ ఎదురుదాడికి దిగేవారు. దీంతో బౌలర్లు కూడా కొట్టుకో అన్నట్టుగానే బౌలింగ్ వేసేవారు. ఫలితంగా రికార్డు స్థాయిలో పరుగులు నమోదు అయ్యేవి. గత సీజన్లో హైదరాబాద్ జట్టు భారీగా పరుగులు సాధించింది అంటే దానికి ప్రత్యేకంగా కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు బ్యాటర్లకు అనుకూలంగా ఉన్న నిర్ణయాలను బీసీసీఐ సవరించడం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అదే కాదు బౌలర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు ఐపీఎల్లో సలైవా(బంతిని ఉమ్మితో రఫ్ చేయడం) పై నిషేధం ఉండేది. దానిని ఈ సీజన్లో ఎత్తేస్తున్నట్టు బిసిసిఐ ప్రకటించింది. ఫలితంగా బౌలర్లు బంతి మీద గ్రిప్ లభించినప్పుడు ఉమ్మి వేసి రుద్దుకోవచ్చు. దీనివల్ల బౌలర్లు బంతిపై పట్టు సాధించవచ్చు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో రెండో బంతిని బౌలర్లు వినియోగించుకోవచ్చు. అయితే రెండవ ఇన్నింగ్స్ 11 ఓవర్ల తర్వాత రెండవ బంతిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంఫాక్ట్ ప్లేయర్ నిబంధనను బీసీసీఐ ఈ ఐపిఎల్ సీజన్లోనూ యధావిధిగా అమలు చేయనుంది. ఈ విధానంపై గతంలో విమర్శలు వచ్చినప్పటికీ.. ఈ సీజన్లో నిలిపివేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. బీసీసీఐ మాత్రం ఆ దిశగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా ఆ నిబంధన యధావిధిగా ఉంటుందని స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం బౌలర్లకు మేలు చేయబోతోంది. వికెట్లు పడని సందర్భంలో.. పరుగులు అదేపనిగా వరదలా పారుతున్న సమయంలో సలైవా నిబంధనను బీసీసీఐ ఎత్తివేయడం బౌలర్లకు ఆయాచిత వరంలాగా మారే అవకాశం ఉంది.

Also Read : మిగతా జట్ల లాగా.. SRH కు కూడా కెప్టెన్ ను మార్చేస్తే..