Homeక్రీడలుక్రికెట్‌IPL free streaming: ఆఫర్లే ఆఫర్లు.. ఐపీఎల్ ఫ్రీగా చూసేయండి బాస్..

IPL free streaming: ఆఫర్లే ఆఫర్లు.. ఐపీఎల్ ఫ్రీగా చూసేయండి బాస్..

IPL free streaming: ఐపీఎల్ మొదలైంది. ఎండాకాలంలో అభిమానులకు సాయంత్రంపూట క్రికెట్ మజాను అందిస్తోంది. చాలామందికి టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. స్థోమత ఉన్నవారు మైదానాలకు పరుగులు తీస్తున్నారు. ఐపీఎల్ అంటేనే వేగానికి కొలమానం కాబట్టి అభిమానులు అసలుసిసలైన క్రికెట్ ఆనందాన్ని పొందుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్ లు జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈక్రమంలో అభిమానులకు అద్భుతమైన ఆపర్లను నెట్ వర్క్ ప్రొవైడర్లు అందిస్తున్నాయి. అదనపు రుసుం భారం లేకుండా యూజర్లకు క్రికెట్ మజాను కలిగిస్తున్నాయి. […]

IPL free streaming: ఐపీఎల్ మొదలైంది. ఎండాకాలంలో అభిమానులకు సాయంత్రంపూట క్రికెట్ మజాను అందిస్తోంది. చాలామందికి టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. స్థోమత ఉన్నవారు మైదానాలకు పరుగులు తీస్తున్నారు. ఐపీఎల్ అంటేనే వేగానికి కొలమానం కాబట్టి అభిమానులు అసలుసిసలైన క్రికెట్ ఆనందాన్ని పొందుతున్నారు.

ఐపీఎల్ మ్యాచ్ లు జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈక్రమంలో అభిమానులకు అద్భుతమైన ఆపర్లను నెట్ వర్క్ ప్రొవైడర్లు అందిస్తున్నాయి. అదనపు రుసుం భారం లేకుండా యూజర్లకు క్రికెట్ మజాను కలిగిస్తున్నాయి.

ఎయిర్ టెల్ ఆఫర్లు ఇలా

రూ.449 ప్లాన్ తో 26రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
రోజుకు 4జీబీడాటా లభిస్తుంది. జియోహాట్ స్టార్ ఫ్రీ గా చూడొచ్చు.

రూ.1029 ప్లాన్ తో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2 జీబీ డాటా లభిస్తుంది. జియో హాట్ స్టార్ ఫ్రీ.

రూ.3,999 ప్లాన్ తో ఏడాది మొత్తం జియోహాట్ స్టార్ ఫ్రీ. రోజుకు 2 జీబీ డాటా వస్తుంది.

Also Read: ముంబై ఇండియన్స్ గెలవడానికి అంత పని చేసిందా.. వెలుగులోకి సంచలన నిజం

వోడాఫోన్ ఐడియా

రూ.399 ప్లాన్ లో 28 రోజులపాటు అన్ లిమిటెడ్ 5జీ డాటా లభిస్తుంది. జియో హాట్ స్టార్ ఫ్రీగా చూడొచ్చు.

రూ.469 ప్లాన్ తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీడాటా లభిస్తుంది. మూడునెలలపాటు జియో హాట్ స్టార్ ఫ్రీగా చూడొచ్చు.

రూ.3699 ప్లాన్ తో ఏడాది పాటు రోజుకు 2జీబీ డాటా లభిస్తుంది. జియో హాట్ స్టార్ ఉచితంగా చూడొచ్చు.

బీఎస్ ఎన్ ఎల్

రూ.499 ప్లాన్ ద్వారా 90 రోజుల పాటు జియో హాట్ స్టార్ ఉచితంగా చూడొచ్చు. అపరితమైన డాటా సౌకర్యాన్ని పొందొచ్చు.

జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా స్పెషల్ రీచార్జ్ లు

949 రీచార్జ్ ద్వారా 84 వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2 జీబీ డాటా వస్తుంది. అంతే కాదు మూడు రోజుల పాటు జియో హాట్ స్టార్ ను ఉచితంగా చూడొచ్చు.

349 రీచార్జ్ ద్వారా 28 రోజుల పాటు రోజుకు 2 జీబీ డాటా లభిస్తుంది. జియోహాట్ స్టార్ ను కూడా ఉచితంగా చూడొచ్చు.

ఇవే గాక, స్మాల్ ప్యాక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.101, రూ.151 రీచార్జ్ ద్వారా డాటా తో పాటు జియో హాట్ స్టార్ ను ఉచితంగా చూడొచ్చు.

సోనీలివ్,జీ5 లాంటి ఎంటర్టైన్మెంట్ యాప్స్ కూడా చూడొచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper