Mahesh Babu worked with director: చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా తక్కువ రోజుల్లోనే స్టార్ హీరోగా అవతరించాడు. ఆయన నుంచి వచ్చే సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెల్లడానికి గల కారణం కూడా అదే కావడం విశేషం… గతంలో కొద్దిరోజుల పాటు అతనికి సక్సెస్ లు లేకపోయిన కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తూనే సినిమాలను సైతం చేస్తున్నాడు… పవన్ కళ్యాణ్ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు సైతం డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. కెరియర్ మొదట్లో వైవిధ్య భరితమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మహేష్ బాబు ఆ తర్వాత కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేశాడు.
మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ తో భారీ విధ్వంసాలను సృష్టించగలిగే సినిమాలను చేసి స్టార్ హీరోగా అవతరించాడు. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇక మహేష్ బాబుకి పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో ‘ఖుషి’ సినిమా అంటే చాలా ఇష్టమట…అప్పట్లో ఖుషి సినిమా పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది.
Also Read: ‘అరుంధతి’ హిందీ రీమేక్ లో శ్రీలీల ..ఫస్ట్ లుక్ ని చూసి నవ్వుకుంటున్న నెటిజెన్స్..
ఇండస్ట్రీ రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ఇక అలాంటి సినిమా నాకు పడితే బాగుండేది అని మహేష్ బాబు సైతం వాళ్ళ నాన్న అయిన కృష్ణ గారి దగ్గర చెప్పారట. అందుకే కృష్ణ ఎస్ జె సూర్య ని పిలిపించి మరి మహేష్ బాబుతో ఒక సినిమా చేయమని చెప్పారట.
దాంతో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ‘నాని’ సినిమా వచ్చింది. ఇది ఒక ఎక్స్పరిమెంటల్ సినిమాగా రావడంతో ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. దాంతో సినిమా ఫ్లాప్ అయింది…మొత్తానికైతే గతంలో మహేష్ బాబు పలు సందర్భాల్లో ఖుషి సినిమా బాగా నచ్చిందని చెప్పడం పవన్ కళ్యాణ్ అభిమానులను సైతం ఆనందపడేలా చేసింది…