IPL 2025 : ఐపీఎల్ లో క్రికెట్ అసోసియేషన్లు – ఫ్రాంచైజీ ల మధ్యప్రస్థ ఒక యుద్ధమే జరుగుతున్నది.. ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ – సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య టికెట్ల విషయం పెను దుమారాన్ని రేపింది. కాంప్లిమెంటరీ పాస్ ల విషయంలో తమను హైదరాబాద్ టికెట్ అసోసియేషన్ బెదిరిస్తోందని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఆరోపించింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో.. ఒక్కసారిగా విజిలెన్స్ పోలీసులు ప్రవేశించడంతో వివాదం కాస్త సద్దుమణిగింది.. దీనిని మర్చిపోకముందే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ – రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజ్మెంట్ మధ్య గొడవ మొదలైనట్టు తెలుస్తోంది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏకంగా ఫిక్సింగ్ కు పాల్పడిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అడ్ హక్ కమిటీ కన్వీనర్, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే జయదీప్ బిహాని సంచలన ఆరోపణలు చేశారు. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోవడం పట్ల ఆయన అనేక రకాల సందేహాలను వ్యక్తం చేశారు. ” గెలుపు సాధిస్తుందనుకున్న మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదు. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ లో స్థానిక ప్రభుత్వం అడ్ హక్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీని ఏకంగా ఐదుసార్లు తొలగించింది.. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్లను ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. ఇక ఐపీఎల్ సీజన్ మొదలయ్యేసరికి జిల్లా పరిషత్ కు బాధ్యతలు అప్పగించారు. బీసీసీఐ మాత్రం పోటీల నిర్వహణకు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కు లెటర్ పంపించింది. కానీ రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ మాత్రం సవాయి మాన్సింగ్ స్టేడియం నుంచి మాకు ఎంఓయూ లేదని కొత్త కారణాలు చెబుతోంది. ఎం ఓ యూ లేకపోయినప్పటికీ జిల్లా పరిషత్ కు అద్దె చెల్లిస్తున్నారు. ఇది ఎందుకో రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ చెప్పడం లేదని” జయదీప్ ఆరోపించారు.
Also Read : విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా అరుదైన ఘనత..
తీవ్ర దుమారం
జయదీప్ చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.. గతంలో ఫిక్సింగ్ కు పాల్పడిన నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై రెండు సంవత్సరాలపాటు ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించారు.. ఇక జయదీప్ చేసిన ఆరోపణ ప్రకారం రాజస్థాన్ జట్టు గత శనివారం లక్నో జట్టు చేతిలో ఓటమిపాలైంది. కీలకమైన రెండు పరుగులు చేయలేక తలవంచింది.. ఈ మ్యాచ్లో లక్నో ఫస్ట్ బ్యాటింగ్ చేసి, 180 రన్స్ చేసింది. ఆ టార్గెట్ ఫినిష్ చేయడంలో రాజస్థాన్ చివరి వరకు దూకుడుగా ఆడినప్పటికీ.. చివరి ఓవర్ లో చేతులెత్తేసింది.. విజయానికి అవసరమైన పరుగులు తీయలేక తలవంచింది… దీంతో రెండు పరుగుల తేడాతో రాజస్థాన్ ఓటమిపాలైంది. వాస్తవానికి రాజస్థాన్ అలా ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. రాజస్థాన్ ఓడిపోయిన తర్వాత తెరపైకి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు రకరకాల ఆరోపణలు చేయడం సరికొత్త అనుమానాలకు తావిస్తోంది. మరి దీనిపై ఐపీఎల్ నిర్వాహక కమిటీ, బీసీసీఐ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Also Read : అరుదైన అద్భుతం: ఒకే రోజు సూపర్ ఇన్నింగ్స్ తో అలరించిన ఇద్దరు దిగ్గజాలు!