Gill Sudarshan : ప్రస్తుత ఐపీఎల్లో గుజరాత్ జట్టు 8 మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఆరు విజయాలు సాధించింది. పంజాబ్ జట్టు చేతిలో ఒకసారి, లక్నో జట్టు చేతిలో మరొకసారి ఓడిపోయింది.. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్, ఢిల్లీ, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల పై గుజరాత్ విజయాలు సాధించింది. ఈ జట్టు ఖాతాలో ప్రస్తుతం 12 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ +1.104 ఉంది. గుజరాత్ సాధించిన విజయాలలో ఆ జట్టు కెప్టెన్ గిల్, ఓపెనర్ సుదర్శన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ సరికొత్త ఆట తీరును ప్రత్యర్థి జట్లకు పరిచయం చేస్తున్నారు. బౌలర్ ఎవరనేది చూడటం లేదు. పిచ్ ఎలాంటిదైనా ఆగడం లేదు. వేగమే పరమార్ధంగా.. దూకుడే అసలైన అస్త్రంగా బ్యాటింగ్ చేస్తున్నారు. అంతేకాదు ఐపీఎల్ లాంటి టోర్నీలలో తొలి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేస్తూ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు.
Also Read : అరుదైన అద్భుతం: ఒకే రోజు సూపర్ ఇన్నింగ్స్ తో అలరించిన ఇద్దరు దిగ్గజాలు!
సరికొత్త రికార్డు సృష్టించారు
గుజరాత్ జట్టు తరఫున ఓపెనర్లు గిల్ – సాయి సుదర్శన్ సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఆరుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన భారత జోడీగా సాయి సుదర్శన్ – గిల్ నిలిచారు. వీరిద్దరూ ఈ సీజన్లో రెండుసార్లు శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకుముందు రాహుల్ – మాయాంక్ అగర్వాల్, గౌతమ్ గంభీర్ – రాబిన్ ఊతప్ప ఐదుసార్లు శతక భాగస్వామ్యాలు నమోదు చేశారు. మొత్తంగా ఈ జాబితాలో అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన రికార్డు మాత్రం విరాట్ కోహ్లీ – డివిలియర్స్ పేరు మీద ఉంది. వీరిద్దరూ బెంగళూరు జట్టుకు తొలి వికెట్ కు పదిసార్లు శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ.. వేగంగా పరుగులు తీస్తూ.. ప్రత్యర్థి జట్టు బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేవారు. అందువల్లే వీరికి అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్లు అని పేరు వచ్చింది. డివిలియర్స్ బెంగళూరు జట్టులో ఉన్నంత సేపు మెరుపు వేగంతో పరుగులు వచ్చేవి. మిస్టర్ 360 గా పేరుపొందిన డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయేవాడు. బంతి మీద కోపం ఉన్నట్టు.. బౌలర్ల మీద ప్రతీకారం ఉన్నట్టు వీర విహారం చేసేవాడు. విరాట్ కోహ్లీ కూడా అదే స్థాయిలో బ్యాటింగ్ చేసేవాడు. అందువల్ల బెంగళూరు జట్టు వేగంగా పరుగులు తీయగలిగేది.. చాలా సంవత్సరాల పాటు వీరిద్దరూ బెంగళూరు జట్టుకు తొలి వికెట్ కు మెరుగైన భాగస్వామ్యం నమోదు చేసేవారు. విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుకు ఓపెనర్ గా ఆడుతున్నాడు. అతడికి సాల్ట్ తగ్గ జోడిగా మారాడు. వీరిద్దరూ దూకుడుగానే బ్యాటింగ్ చేస్తున్నారు.. బెంగళూరు జట్టుకు మెరుగైన పరుగులు తొలి వికెట్ కు నమోదు చేస్తున్నారు.
Also Raed : ఐపీఎల్ లో కి మరో టీనేజర్.. CSK తరఫున 17 ఏళ్ల ఆటగాడి ఎంట్రీ.. ఎన్ని పరుగులు చేశాడంటే..