IPL 2025: ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్ కు పేరుంది. ఈ జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. గత ఏడాది దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. అంతకుముందు ఏడాది కూడా అంత గొప్పగా ఆడలేదు. గత ఏడాది ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగింది. కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. అతడు కెప్టెన్ గా రావడాన్ని రోహిత్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మైదానంలోనూ రోహిత్ కు అనుకూలంగా.. హార్దిక్ పాండ్యాకు వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని నిరసిస్తూ మైదానంలో గొడవలకు కూడా దిగారు.
Also Read: బిసిసిఐ కీలక నిర్ణయం.. ఆ కాంట్రాక్టులు కోల్పోతున్న రోహిత్, విరాట్, జడేజా..
అతడు ఆడేది అనుమానమే
ముంబై ఇండియన్స్ జట్టులో కీలక బౌలర్ గా బుమ్రా ఉన్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో అతడు వెన్ను నొప్పికి గురయ్యాడు. గతంలో వెన్ను నొప్పికి సంబంధించి అతడు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. సుదీర్ఘకాలం చికిత్స పొందాడు. ఆ తర్వాత మైదానంలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. గత ఆస్ట్రేలియా సిరీస్లో అతడికి వెన్నునొప్పి మళ్లీ తిరగబెట్టడంతో ఆడ లేకపోయాడు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా బుమ్రా దూరమయ్యాడు. ఇక ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ కు కూడా బుమ్రా దూరంగానే ఉన్నాడు. బుమ్రా కు ఇంకా వెన్ను నొప్పి తగ్గలేదని.. అతడు చికిత్స పొందుతూనే ఉన్నాడని.. అతడు నూటికి నూరు శాతం సామర్థ్యాన్ని సాధించలేదని.. దానికి ఇంకా సమయం పడుతుందని ముంబై ఇండియన్స్ జట్టు వర్గాలు చెబుతున్నాయి. అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. గాయం ఉన్నప్పటికీ అతడు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక ముంబై జట్టు 4, 5 మ్యాచ్లకు బుమ్రా దూరమవుతాడని తెలుస్తోంది. ఆ తర్వాత శరీర సామర్థ్యాన్ని తిరిగి సాధిస్తే.. అతడు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.. దీంతో ముంబై ఇండియన్స్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ” ముంబై ఇండియన్స్ జట్టు ప్రధాన బౌలర్ బుమ్రా ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. అతడు చికిత్స పొందుతున్నాడు. పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించలేకపోయాడు. దానిని సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడు కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. అందువల్ల కొన్ని మ్యాచ్లకు దూరం కావలసి వస్తుందని” జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బుమ్రా దూరమైతే.. ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారు? అనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తమౌతోంది. గత సీజన్లో బుమ్రా ఉన్నప్పటికీ మిగతా బౌలర్ల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో ముంబై జట్టు పెద్దగా విజయాలు నమోదు చేయలేదు.
Also Read: సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ మేనియా.. ఇప్పటివరకు ఎంతమంది సెర్చ్ చేశారంటే?