BCCI: ఆటగాళ్లకు కల్పించే సౌకర్యాలు.. అందించే జీతభత్యాల విషయంలో బిసిసిఐ మిగతా యాజమాన్యాలతో పోల్చితే అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. ఆటగాళ్ల సంక్షేమం కోసం బీసీసీఐ తీవ్రంగా కృషి చేస్తూ ఉంటుంది. అందువల్లే బీసీసీఐ లో ఒక్కసారైనా సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకోవాలని ప్రతి ఆటగాడు కోరుకుంటాడు. చివరికి పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా ఇదే అభిప్రాయాన్ని అంతర్గతంగా వ్యక్తం చేస్తారంటే అతిశయోక్తి కాక మానదు.
Also Read: CT రద్దయితే ఐసిసి ఏం చేస్తుంది? ఛాంపియన్ ను ఎలా నిర్దేశిస్తుంది?
బీసీసీఐ అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లకు గ్రేడ్ A+ కాంట్రాక్ట్ ఇస్తుంది. ప్రస్తుతం జాతీయ జట్టులో ఉన్న విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, బుమ్రా ఆ గ్రేడ్ లో ఉన్నారు. అయితే ఇటీవల టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు నిర్ణయం తీసుకున్నారు.. అయితే నాటి నుంచి నేటి వరకు రోహిత్, విరాట్, రవీంద్ర జడేజా విషయంలో బీసీసీఐ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జాతీయ మీడియాలో ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత బీసీసీఐ దీనిపై ఒక నిర్ణయానికి వస్తుందని తెలుస్తోంది. గత ఏడాది శ్రేయస్ అయ్యర్ కు సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కలేదు. అయితే ఈసారి అతడికి ఆ అవకాశం లభించవచ్చని తెలుస్తోంది..
ఈసారి కూడా అతడికి నిరాశే
గత ఏడాది బీసీసీఐ వెల్లడించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఇషాన్ కిషన్ పేరు కనిపించలేదు. శ్రేయస్ అయ్యర్ కు కూడా చోటు తగ్గలేదు. అంతకుముందు అయ్యర్ కు చోటు లభించినప్పటికీ.. అతడు దేశవాళి క్రికెట్ టోర్నీ ఆడక పోవడంతో సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతనిని తొలగించారు. ఇక ఈశాన్ కిషన్ కూడా దేశవాళి క్రికెట్ ఆడకుండా.. సాకులు చెప్పడంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతని పేరు కూడా తొలగించింది. అయితే ఇషాన్ కిషన్ జాతీయ జట్టులోకి రావడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ జాతీయ జట్టులోకి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. చివరికి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. అంతేకాదు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లోనూ టాప్ – 10 లో స్థానం సంపాదించుకున్నాడు. అయితే అయ్యర్ అదరగొట్టే ఆట తీరుతో ఆకట్టుకుంటున్న నేపథ్యంలో అతడికి ఈసారి ప్రకటించే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ” రోహిత్, విరాట్, రవీంద్ర జడేజా t20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో వారి గ్రేడ్ పడిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత బీసీసీఐ ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో కొంత మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టులో చోటు లభిస్తుంది. అందులో శ్రేయస్ అయ్యర్ కూడా ఒకడు. ఈసారి అతనికి అవకాశం లభించవచ్చు. ఎందుకంటే అతడు దూకుడుగా ఆడుతున్నాడు. దాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. జట్టు కోసం బలమైన ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. అలాంటి ఆటగాడిని బిసిసిఐ వదులుకోదు. గతంలో చేసిన తప్పుకు ప్రయాశ్చితంగా అయ్యర్ అనేక రకాల ప్రయత్నాలు చేశాడు. దేశవాళి క్రికెట్ ఆడాడు. తన తప్పు తాను తెలుసుకున్నాడు కాబట్టి.. ఇకపై ఇబ్బంది ఉండదు. ఛాంపియన్స్ ట్రోఫీలో అయ్యర్ అదరగొడుతున్నాడు. అన్ని కలిసి వస్తే ఫైనల్ మ్యాచ్లో అతడు సత్తా చాటే అవకాశం ఉంది. స్ఫూర్తిదాయకమైన ఆటగాళ్లను బీసీసీఐ ప్రోత్సహిస్తూనే ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ కూడా గొప్ప ఆటగాడు. అందువల్లే అతనికి సెంట్రల్ కాంట్రాక్టులో చోటు లభించే అవకాశం ఉందని” క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.