Chhaava : లేటెస్ట్ బాలీవుడ్ సెన్సేషన్ ‘చావా'(Chhaava Movie) తెలుగు వెర్షన్ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం మన తెలుగు ఆడియన్స్ విడుదల రోజు నుండే ఎదురు చూసారు. సోషల్ మీడియా లో గట్టిగా డిమాండ్ చేయడంతో, నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) ఆ డిమాండ్ ని గమనించి తెలుగు డబ్బింగ్ రైట్స్ ని కొనుగోలు చేసాడు. అయితే ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, మన తెలుగు ఆడియన్స్ ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ ఇవ్వడం కష్టమేనేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రేంజ్ రెస్పాన్స్ ఇవ్వడం తో ట్రేడ్ పండితులు సైతం షాక్ కి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుక్ మై షో లో ప్రస్తుతం ఈ సినిమాకి గంటకు నాలుగు వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. రీసెంట్ గా విడుదలైన కొత్త తెలుగు సినిమాలకు కూడా ఈ రేంజ్ ట్రెండ్ లేదు.
Also Read : ఛావా (తెలుగు) ఫుల్ మూవీ రివ్యూ…
మంచి సినిమాని మన ఆడియన్స్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆదరిస్తారు అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. అయితే ట్రేడ్ పండితులు అందితున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి రెండు కోట్ల 45 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. గ్రాస్ వసూళ్లు మూడు కోట్ల రూపాయలకు పైగానే ఉందని తెలుస్తుంది. ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసిన హౌస్ ఫుల్స్. షేర్ వసూళ్లు దాదాపుగా రెండు కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. ఇక రెండవ రోజు అయితే మొదటి రోజు కంటే బ్లాక్ బస్టర్ వసూళ్లను నమోదు చేసుకుంది. మొదటి రోజు మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, రెండవ రోజు కచ్చితంగా నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు.
బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకి నేడు ఉదయం నుండి దాదాపుగా 16 వేలకు పైగా టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడుపోయాయట. హిందీ వెర్షన్ ని ఎదో ఒకసమయం లో దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి ట్రెండ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త సినిమాలు విడుదలకు దగ్గర్లో లేవు. థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి. ఆడియన్స్ కి కూడా ఎదో ఒక ఎంటర్టైన్మెంట్ కచ్చితంగా ఉండాలి కాబట్టి, ఈ చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు మన చరిత్రకు సంబంధించిన స్టోరీ ని తెలుసుకోవడానికి, ఎప్పుడూ ముందు ఉంటారు మన తెలుగు ఆడియన్స్. ఇదే తరహా ఊపుని కొనసాగిస్తూ ఈ చిత్రం ముందుకు పోతే ఫుల్ రన్ లో కేవలం తెలుగు వెర్షన్ నుండి 50 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
Also Read : అక్షరాలా 1 కోటి టిక్కెట్లు..చరిత్ర సృష్టించిన ‘చావా’..ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్ ఎంతంటే!