IPL 2025 Impact Player Rule: 206 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 193 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. ఢిల్లీ జట్టులో కరుణ్ నాయర్(89: 40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అదరగొట్టాడు. వాస్తవానికి కరుణ్ నాయర్ ఇంపాక్ట్ ఆటగాడిగా ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. 206 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన ఢిల్లీకి ప్రారంభంలోనే గట్టి షాక్ తగిలింది. జేమ్స్ ఫ్రేజర్ మెక్ గూర్క్ రూపంలో తొలి వికెట్ పడిపోయింది. తర్వాత వన్ డౌన్ ఆటగాడిగా వచ్చిన కరుణ్ నాయర్ శివతాండవం చేశాడు. మైదానాన్ని తన బ్యాటింగ్ తో హోరెత్తించాడు. ఇంపాక్ట్ ఆటగాడికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. ఇంపాక్ట్ ఆటగాడి వల్ల మ్యాచ్ స్వరూపం ఎలా మారుతుందో నిరూపించాడు. ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు ఇంపాక్ట్ ఆటగాడిగా ముఖ్యంగా బ్యాటర్ గా చెరగని ముద్ర వేశాడు కరుణ్ నాయర్. అలాంటి ఇంపాక్ట్ సోమవారం కూడా చెన్నై జట్టు పై ఎఫెక్ట్ చూపించింది. అంతేకాదు చెన్నై జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.
Also Read: చెన్నై కి కొత్త ఊపిరి పోసిన ఆ ఒక్క ఓవర్…
చెన్నై జట్టు విజయం అందుకే సాధించింది
సోమవారం నాటి మ్యాచ్లో లక్నో జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 166-7 స్కోర్ చేసింది.. అయితే లక్నో జట్టు రవి బిష్ణోయ్ ని ఇంపాక్ట్ ఆటగాడిగా తీసుకుంది. అతడు అద్భుతంగా బౌలింగ్ వేసాడు. మూడు ఓవర్లు వేసి, 18 పరుగులు ఇచ్చాడు. రవీంద్ర జడేజా, రాహుల్ త్రిపాఠి వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ రెండు వికెట్లను చెన్నై జట్టు కోల్పోయిందో.. అప్పుడే ఓటమికి దగ్గరగా వచ్చింది. ఈ దశలో చెన్నై జట్టు ఇంపాక్ట్ ఆటగాడిగా శివందుబే ను తీసుకుంది. అతడు 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు,రెండు సిక్సర్లు ఉన్నాయి. వాస్తవానికి అటు లక్నో జట్టు, ఇటు చెన్నై జట్టు ఇంపాక్ట్ ఆటగాళ్ల విషయంలో ముందు చూపుతో వ్యవహరించాయి. ప్రతిభావంతమైన ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చాయి. వారు కూడా తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఒకవేళ గనుక చెన్నై జట్టులో శివం దుబే కనుక నిలబడకపోయి ఉంటే.. లక్నో జట్టు కచ్చితంగా విజయం సాధించేది.. లక్నో జట్టు కనుక రవి బిష్ణోయ్ ని కనుక తీసుకోకపోయి ఉంటే.. చెన్నై జట్టు ఆ స్థాయిలో వికెట్లను కోల్పోకపోయేది. మొత్తానికి ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడంతో.. వారిద్దరే రెండు జట్లలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు..
Also Read: ధోని ఒకే ఒక్కడు.. మైదానంలో ఉన్నాడంటే రికార్డులు బద్దలు కావాల్సిందే.