Allu Arjun and Trivikram : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాప మంది దర్శకులు సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక కొంతమంది దర్శకులు మాత్రం పాన్ ఇండియా సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా మంచి కథలతో సినిమాలు చేయగలిగితే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. లేకపోతే మాత్రం సినిమా డిజాస్టర్ బాట పడుతుందనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)… ఈయన గత సంవత్సరం చేసిన ‘గుంటూరు కారం’ (Gunturu karam) సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అంతకు ముందు వరకు ఆయన వరుస సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేసినప్పటికి ఒక్క సినిమాతో తన ఐడెంటిటి మొత్తాన్ని కోల్పోయాడనే చెప్పాలి. ప్రస్తుతం ఆయనకు స్టార్ హీరోల నుంచి అవకాశాలు వచ్చే ఛాన్సులు అయితే లేనట్టుగా తెలుస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి స్టార్ హీరో అతనితో సినిమా చేయడానికి సిద్ధమైనప్పటికి మధ్యలో అట్లీ (Atlee) రావడంతో అతనికి పాన్ ఇండియా మార్కెట్ ఉంది కాబట్టి ఐకాన్ స్టార్ (Icon Star)అతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి మొత్తానికైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ ను పక్కనపెట్టి అట్లీ తో అల్లు అర్జున్ సినిమా చేయడం పట్ల త్రివిక్రమ్ అభిమానులు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి మూడు సూపర్ డూపర్ సక్సెస్ లను అందించిన త్రివిక్రమ్ ను ఈరోజు అల్లు అర్జున్ పక్కన పెట్టడం అనేది సరైన విషయం కాదు. ఇక అట్లీ పెద్ద గొప్ప దర్శకుడు కాదు.
Also Read : అల్లు అర్జున్ హ్యాండ్ ఇవ్వడంతో మరో హీరో తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్…
ఆయన ఇతర భాషల్లో వచ్చే సినిమాల్లోని సీన్స్ ని తీసుకొని ఒక స్క్రిప్ట్ రాసుకుని దాన్ని సినిమాగా చేస్తూ ఉంటాడు అంతే తప్ప అతని సినిమాల్లో ఏ సినిమా కూడా ఒక ఫ్రెష్ థాట్ ని ముందుకు తీసుకెళ్లే సినిమా లేకపోవడం విశేషం…
మరి అలాంటి దర్శకుడి కోసం అల్లు అర్జున్ త్రివిక్రమ్ ను పక్కన పెట్టడం చాలా దారుణం అంటూ ఆయన అభిమానులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం త్రివిక్రమ్ ధనుష్ (Dhanush) తో గాని, సూర్య(Surya) తో గాని ఒక భారీ ప్రాజెక్టుని చేసి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసి చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడు ఇకమీదట చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చే సినిమా జానర్ ఏంటో తెలుసా..?