MS Dhoni: అదేదో సినిమాలో నీకు నరుకుతుంటే అలుపు వస్తుంది.. నాకు ఊపు వస్తుంది అంటాడు కదా బాలకృష్ణ.. సేమ్ అదే డైలాగు ఐపీఎల్లో ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని చూపిస్తున్నాడు. కాకపోతే నరుకుడులో కాదు.. కీపింగ్ లో.. ఇప్పటికీ కూడా ధోని అదే స్థాయిలో కీపింగ్ చేస్తున్నాడు. ఇటీవలి ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ ను మెరుపు వేగంతో స్టంప్ అవుట్ చేసిన ధోని.. మరో ఇద్దరు ఆటగాళ్ల ను కూడా అదే స్థాయిలో స్టంప్ అవుట్ చేశాడు. ఇప్పుడు తాజాగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో మరో అరుదైన ఘనతను ధోని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మరే ఆటగాడు కూడా సాధించలేని రికార్డును సృష్టించాడు. లక్నో జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఆయుష్ బదోని ని స్టంప్ అవుట్ చేసి ధోని సరికొత్త రికార్డును తన పేరు మీద సృష్టించుకున్నాడు.
Also Read: ధోని మాస్టర్ మైండ్.. నికోలస్ పూరన్ అన్నీ మూసుకొని వెళ్ళాడు..
ఒకే ఒక్కడు ధోని
ఐపీఎల్ చరిత్రలో ఇప్పుడు వరకు ధోని 201* అవుట్ లలో పాలుపంచుకున్నాడు.. తద్వారా ఈ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. 182 స్టంప్ అవుట్ల ద్వారా దినేష్ కార్తీక్ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. 126 అవుట్ లలో పాలుపంచుకొని ఎబి డివిలియర్స్ మూడవ స్థానంలో.. 124 అవుట్లలో పాలుపంచుకొని రాబిన్ ఊతప్ప, 118 అవుట్లలో పాలుపంచుకొని వృద్ధి మాన్ సాహా, 116 అవుట్ లలో పాలుపంచుకొని విరాట్ కోహ్లీ.. తదుపరి స్థానాలలో కొనసాగుతున్నారు. ” 43 సంవత్సరాల వయసులో ఈ స్థాయిలో కీపింగ్ చేస్తున్నాడు అంటే మామ విషయం కాదు. వాస్తవానికి ధోనికి వయసు పైబడుతున్నా కొద్దీ ఉత్సాహం పెరుగుతోంది. అతనిలో ఇంకా ఏదో సాధించాలనే కోరిక పెరుగుతోంది. అందువల్లే అతడు ఇప్పటికీ కూడా ఐపీఎల్ ఆడుతున్నాడని” అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
వెనకాల ధోని ఉన్న విషయాన్ని మర్చిపోయాడు
చెన్నై తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో ఆటగాడు ఆయుష్ బదోని రవీంద్రజడేజా బౌలింగ్లో ముందుకు వచ్చి ఆడేందుకు ప్రయత్నించాడు. ఆ బంతి మిస్ అయింది. ధోని చేతుల్లో పడింది. అంతేకాదు అంతకంటే ఎక్కువ వేగంతో వికెట్లను గిరాటేసింది. దీంతో ఆయుష్ బదోని నిరాశతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆయుష్ బదోని అవుట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. వెనకాల ధోని ఉన్నాడు అని చూసుకోవలసిన అవసరం లేదా అంటూ.. ఆయుష్ బదోనిని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ” ధోని కి 43 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ అతడు విశ్రాంతి తీసుకోవడానికి మైదానం లోకి రాలేదు. అతడు సైలెంట్ గా ఉంటాడని అనుకుంటే ఎలా.. అతడు ఏం చేశాడో ఇప్పటికైనా అర్థమైందా.. ధోని లాంటి కీపర్ గా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అత్యంత రక్షణ ధోరణి ప్రదర్శించాలని” నెటిజన్లు అంటున్నారు.
200 DISMISSAL FOR THE GOAT
– MS Dhoni, The Greatest ever in IPL History. pic.twitter.com/xElZN9WPtR
— Johns. (@CricCrazyJohns) April 14, 2025