Ram Charan and Sukumar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే తన కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ (Ram Charan) మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకన్నాడు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా గ్లోబల్ స్టార్ (Global Star) గా కూడా ఎదిగాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు (Buchhi Babu) డైరెక్షన్ లో ‘పెద్ది’ (Peddi) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. మరి ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెరిగిపోతున్నాయి. ఇక ఈ మూవీ తర్వాత సుకుమార్ (Sukumar) డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రామ్ చరణ్ లోని పూర్తి స్థాయి నటుడిని బయటికి తీసింది చెప్పాలి. మరి ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ కనక చూసినట్లయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాంటి రామ్ చరణ్ సుకుమార్ తో చేయబోయే సినిమాలో ఎలాంటి పాత్రలో నటించబోతున్నాడు.
Also Read : రామ్ చరణ్, సుకుమార్ సినిమాకు ‘మిషన్ ఇంపాజిబుల్’ స్ఫూర్తి..ఇలాంటి సినిమాలు మన టాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చుతాయా?
తద్వారా ఆ సినిమాతో వీళ్ళిద్దరూ ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నారనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా ముహూర్తం ఎప్పుడు పెట్టబోతున్నారు అనే దానిమీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సుకుమార్ రామ్ చరణ్ సినిమాకి వచ్చే ఏడాది ఏప్రిల్ లో ముహూర్తం పెట్టే అవకాశాలైతే ఉన్నాయి.
మరి ఇలాంటి సందర్భంలోనే వీళ్ళ కాంబోలో తెరకెక్కుతున్న ఈ రెండోవ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాలను సృష్టిస్తోంది. సుకుమార్ మరోసారి రాంచరణ్ ను ఎలా చూపించబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం సినిమా యూనిట్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
ప్రస్తుతం సుకుమార్ తన రైటింగ్ టీం తో కలిసి ఈ స్క్రిప్ట్ మీదనే కూర్చున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ని పకడ్బందీగా రెడీ చేసి అప్పుడు రంగంలోకి దిగాలి అనే ప్రయత్నంలో సుకుమార్ అయితే ఉన్నాడు.
Also Read : రామ్ చరణ్,సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్..అభిమానులు కలలో కూడా ఊహించని కాంబినేషన్ ఇది!