LSG Vs CSK 2025: లక్నో మైదానంలో లక్నో జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసి…166 రన్స్ స్కోర్ చేసింది. దానిని చేదించడంలో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు బెటర్ పార్ట్నర్షిప్ అందించినప్పటికీ.. ఆ తర్వాత చెన్నై కాస్త తడబాటుకు గురైంది. రాహుల్ త్రిపాటి (9), రవీంద్ర జడేజా (7) వెంటవెంటనే అవుట్ కావడంతో.. చెన్నై జట్టుపై ఒత్తిడి పెరిగిపోయింది.. పైగా లక్నో మైదానం బౌలింగ్ కు సహకరిస్తుండడంతో మిగతా బ్యాటర్లు కూడా ఇబ్బంది పడ్డారు.. ఈ క్రమంలో విజయ్ శంకర్ కూడా (9) త్వరగానే అవుట్ అయ్యాడు. ఈ దశలో వచ్చిన ధోని (26*), శివం దుబే (43*) నాట్ అవుట్ గా నిలవడమే కాదు.. 50+ రన్స్ భాగస్వామ్యం నిర్మించారు. ఫలితంగా చెన్నై జట్టు విజయం సాధించింది. చెన్నై జట్టు పరిస్థితిని శార్దూల్ ఠాకూర్ వేసిన 19 వ ఓవర్ మార్చేసింది. ఆ ఓవర్ లో శార్దూల్ ఠాకూర్ లైన్ తప్పాడు. దారుణంగా పరుగులు ఇచ్చాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేసే అతడు ఒకసారి గా 19 పరుగులు ఇచ్చి లక్నో జట్టు నెత్తి మీద మన్ను పోశాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ చెన్నైవైపు టర్న్ అయింది. అప్పటిదాకా విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడింది. శార్దుల్ అ ఓవర్లో ధారాళంగా పరుగులు ఇవ్వడంతో చెన్నై జట్టు బతికిపోయింది. ఒక రకంగా విజయం వైపు అడుగులు వేసింది.
Also Read: ధోని మాస్టర్ మైండ్.. నికోలస్ పూరన్ అన్నీ మూసుకొని వెళ్ళాడు..
19 పరుగులు ఇచ్చాడు..
విజయం రెండు జట్ల మధ్య సమానంగా ఉన్న నేపథ్యంలో.. లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ శార్దూల్ ఠాకూర్ కు బంతి ఇచ్చాడు. ఠాకూర్ వేసిన తొలి బంతిని శివం దుబే ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత బంతిని నో బాల్ గా వేయగా.. దానిని శివమ్ దుబే సిక్సర్ కొట్టాడు. మరుసటి బంతి ఫ్రీ హిట్ రాగా.. ఆ బంతిని ఠాకూర్ తెలివిగా వేయడంతో శివం దుబే సింగిల్ రన్ మాత్రమే తీశాడు. మూడో బంతికి ధోని సింగిల్ పరుగు తీశాడు. నాలుగో బంతిని శార్దూల్ ఠాకూర్ ఒత్తిడిలో వైడ్ వేశాడు. ఆ మరుసటి బంతిని శివం దుబే సింగిల్ తీశాడు. ఇక చివరి బంతికి ధోని ఫోర్ కొట్టాడు. మొత్తంగా ఈ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్, వైడ్, నోబాల్, సింగిల్స్ మొత్తం కలిపితే 19 పరుగులు వచ్చాయి. అంతకుముందు ఓవర్ లో చెన్నై జట్టు స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 143 పరుగులుగా ఉండేది.19 ఓవర్ తర్వాత లక్నో జట్టు ఓటమికి దగ్గరగా వెళ్లిపోయింది. ఫలితంగా చెన్నై జట్టు స్కోర్ 162 పరుగులకు పెరిగిపోయింది. శివం దుబే వ్యక్తిగత స్కోర్ కూడా 26 పరుగుల నుంచి 38 పరుగులకు పెరిగింది. మొత్తంగా ఈ ఓవర్ చెన్నై జట్టు గతిని పూర్తిగా మార్చేసింది.
Also Read: పూజార, హనుమ విహారి.. అప్డేట్ అవ్వండి.. రహానే, కరుణ్ ను చూసి నేర్చుకోండి! .