India Vs Australia World Cup Final: వరల్డ్ కప్ 2023 లో భాగంగా ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీమ్ లా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఇండియన్ టీమ్ మొదట బ్యాటింగ్ చేస్తూ చాలా అద్భుతమైన స్టార్టప్ తో ముందుకు దూసుకెళ్తున్నట్టు కనిపించింది.అయితే ఒక వైపు నుంచి రోహిత్ శర్మ ఎదురుదాడి చేస్తూ భారీ పరుగులు రాబడుతుంటే మరోవైపు ప్రెజర్ ని తట్టుకోలేక శుభ్ మన్ గిల్ మాత్రం ఎక్కువసేపు క్రిజ్ లో నిలబడలేకపోయాడు. ఇక దాంతో గిల్ నాలుగు పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు.
ఇక ఆ తర్వాత వెంటనే రోహిత్ శర్మ కూడా 47 పరుగులు చేసి మాక్స్ వెల్ బౌలింగ్ ఔట్ అయ్యాడు రోహిత్ ఇంకా కొద్ది సేపు క్రీజ్ లో ఉంటే టీమ్ పరిస్థితి మరోలా ఉండేది.ఇక రోహిత్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా అంత పెద్ద నాక్ ఆడకుండా ఒక ఫోర్ కొట్టి కమ్మిన్స్ బౌలింగ్ లో ఔట్ అయిపోయాడు. ఇక పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఇండియన్ టీం ని ఆదుకునే క్రమం లో కింగ్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా నిదానంగా స్కోర్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇండియా వరుసగా మూడు వికెట్లు కోల్పోవడం వెనక జరిగిన ప్రాబ్లం ఏంటి అంటే ఫైనల్ మ్యాచ్ అవడం వల్ల గిల్ లాంటి ఒక యంగ్ ప్లేయర్ వరల్డ్ కప్ లో ఆడటం ఇదే మొదటిసారి కావడం అందులోనూ ఇది ఫైనల్ మ్యాచ్ అవడం వల్ల హెవీ క్రౌడ్ మధ్యలో ఈ మ్యాచ్ మీద భారీ అంచనాలు ఉండటం వల్ల అవన్నీ మైండ్ లో ఉంచుకొని అతను క్రీజ్ లోకి వచ్చాడు కాబట్టి అతనికి అది ప్రెజర్ లా అనిపించింది.
పాతికేళ్ళు కూడా నిండని కుర్రాడు కాబట్టి అంత ప్రెజర్ ని హ్యాండిల్ చేయలేకపోయాడు. దానివల్లే ఆయన లాంగ్ ఇనింగ్స్ ఆడలేకపోయాడు. ఇక అయ్యర్ ఇలాంటి మ్యాచ్ ల్లో ప్రెజర్ ని బాగా ఎదుర్కొంటాడు అయినప్పటికీ తన ప్రమేయం లేకుండానే బాల్ అనేది అతని బ్యాట్ కి తగిలి కీపర్ కి క్యాచ్ గా వెళ్లడం నిజంగా దురదృష్టం అనే చెప్పాలి. ఇక రోహిత్ శర్మ అయితే తను ఉన్నంత సేపు బౌలర్లను వణికించాడు. కానీ తను కూడా కొద్దిసేపు ఆడుంటే మ్యాచ్ పొజిషన్ వేరేలా ఉండేది మాక్స్ వెల్ వేసిన ఆ ఒక్క బాల్ ని డిఫెన్స్ చేసి ఉంటే బాగుండేది అని ప్రతి అభిమాని అనుకుంటున్నాడు…
ఇక ఇప్పుడు టీం భారం మొత్తాన్ని కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే మోయాల్సి వస్తుంది. భారీ స్కోర్ చేయాలనుకొని బరిలోకి దిగిన ఇండియన్ టీం కల ఎంతవరకు నెరవేరుతుంది అనేది తెలియాల్సి ఉంది… ప్రస్తుతం 21 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 3 వికెట్లు కోల్పోయి 120 రన్స్ తో ఇండియన్ టీం ముందుకు దూసుకెళ్తుంది…