Shubman Gill: భారీ అంచనాలతో ఈరోజు జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఆస్ట్రేలియా టీమ్ ల మధ్య మొదటి నుంచే ఆధిపత్య పోరు అనేది మొదటి నుంచే కొనసాగుతూ వస్తుంది.ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియన్ కెప్టెన్ అయిన కమ్మిన్స్ ఇండియన్ టీంని మొదట బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. ఇక దాంతో మొదట బ్యాటింగ్ కి వచ్చిన ఇండియన్ టీం అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ ఆస్ట్రేలియా బౌలర్లకి చుక్కలు చూపిస్తున్నారు.
ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే ఇంతకుముందు ఎలాగైతే ఏ టెన్షన్ లేకుండా ఫ్రీగా ఆడేవాడో ఈ మ్యాచ్ లో కూడా టెన్షన్ లేకుండా తన సీనియారిటీ మొత్తాన్ని రంగరించి మరి కెప్టెన్ గా ఒక బరువైన బాధ్యతను మోస్తూనే ఇండియన్ టీం కి ఒక భారీ స్కోరు అందించడంలో తన వంతు కృషి చేస్తూ 47 పరుగులు చేశాడు.ఇక ఈ క్రమంలోనే మొదటిసారి వరల్డ్ కప్ ఆడుతున్న శుభ్ మన్ గిల్ ఫైనల్ లో ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకోలేక ఈ మ్యాచ్ లో తొందరగా ఔట్ అయ్యాడు.
అందుకే ఇలాంటి మ్యాచ్ లో కొంచెం సీనియర్ ప్లేయర్లు ఉంటే మ్యాచ్ ని కరెక్ట్ గా అంచన వేస్తూ స్కోర్ ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సీనియర్ ప్లేయర్లకు కూడా ఎక్కువగా అవకాశం ఇస్తూ ఉంటారు. ఇక రోహిత్ మాత్రం తన అనుభవంతో మొడత్యాచ్ స్కోర్ అందించాడు…ఇక ఈ మ్యాచ్ లో గెలిస్తే ఇండియన్ టీం మూడోసారి వరల్డ్ కప్ అందుకున్న టీం గా గుర్తింపు పొందడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ క్రమంలోనే ఇండియన్ టీం మొదటి బ్యాటింగ్ చేస్తు చాలా తొందరగానే గిల్, రోహిత్, అయ్యర్ వికెట్లను కోల్పోయింది ఇక కోహ్లీ,రాహుల్ మీదనే టీమ్ భారం మొత్తం ఆధారపడి ఉంది…
కాబట్టి ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ భారీ స్కోర్ చేయాలాంటి వీళ్లిద్దరూ చివరి వరకు ఆడాలి అలా అయితేనే మన టీమ్ భారీ స్కోరు చేయగలుగుతుంది.అలా భారీ స్కోరు చేస్తేనే ఆస్ట్రేలియా టీం పైన ఒత్తిడి తీసుకొచ్చి చేజింగ్ లో వరుసగా వికెట్లను తీయొచ్చు…ఇక ఇప్పటికే మన బౌలర్లు ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్స్ సంగతి మేము చూసుకుంటాం కానీ బ్యాటింగ్ గురించి మీరు చూసుకోండి అనేంత రేంజ్ లో మన బ్యాట్స్ మెన్స్ కి కాన్ఫిడెన్స్ ఇస్తున్నట్టు గా తెలుస్తుంది.మరి ముఖ్యంగా షమీ అయితే ఈ మ్యాచ్ లో కీలకపాత్ర పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది…