IND vs NZ Final: టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్ లో అభిమానులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎంతో ఆశతో క్రికెట్ మ్యాచ్ లైవ్ చూడాలని అభిమానులు అహ్మదాబాద్ బాట పట్టారు . అయితే ఇదే అదునుగా సప్లై డిమాండ్ సూత్రాన్ని హోటల్ నిర్వాహకులు.. విమానాలు నడిపే సంస్థలు అమలు చేస్తున్నాయి. ఫలితంగా ప్రేక్షకుల జేబులు గుల్ల అవుతున్నాయి.
Also Read: విజయ్-త్రిషల ప్రేమకి ‘విక్రమ్-జ్యోతిక’లే కారణమా? ఆసక్తికరమైన కథనం!
అహ్మదాబాద్ లో ప్రపంచకప్ ఫైనల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఆ మ్యాచ్ మొత్తాన్ని వీక్షించడానికి అభిమానులు భారీగా తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచాయి. మామూలు రోజుల్లో అయితే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ నగరానికి విమాన టికెట్ ధర 3000 వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ధర ఏకంగా 15000 నుంచి 17వేల వరకు చేరుకుంది. ఇక స్థానిక హోటల్స్ కూడా ధరలను భారీగా పెంచేశాయి. 15వేల నుంచి 17వేల వరకు తీసుకుంటున్నాయి. స్థానిక హోటల్స్ లో చిన్నచిన్న గాజులకు కూడా భారీగా ధర పలుకుతున్నది. గతంలో ఒకరోజు ఉంటే 5000 వరకు చార్జ్ చేసేవారు. ఇప్పుడు ఏకంగా 20వేల వరకు వసూలు చేస్తున్నారు. ఫైవ్ స్టార్ హోటల్స్ లో అయితే ఒక డీలక్స్ రూమ్ కు 2 లక్షలు వసూలు చేస్తున్నారు. దీనికి 36వేల రూపాయలను జిఎస్టిగా చార్జ్ చేస్తున్నారు.
అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియం అతిపెద్దది. 2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా ఇదే స్థాయిలో అభిమానులు ఆ నగరానికి చేరుకున్నారు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా, టీమ్ ఇండియా మధ్య జరిగింది. నాటి మ్యాచ్ చూసేందుకు వేలాదిమంది అభిమానులు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియానికి చేరుకున్నారు. అభిమానులు భారీగా తరలి రావడంతో అహ్మదాబాద్ మైదానం నాడు జనసంద్రంగా మారింది. ఇప్పుడు టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. అభిమానులు కూడా భారీగా వస్తున్నారు. దీంతో అహ్మదాబాద్ స్టేడియం ఇసుక వేస్తే రాలనంత తీరుగా అభిమానులతో నిండిపోయింది.
ఈ స్టేడియంలో ఐసీసీ నిర్వహించిన మెగా టోర్నమెంట్లలో టీమిండియా ఆడింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడింది. నాటి మ్యాచ్లో టీమ్ ఇండియా ఓడిపోయింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో టీమిండియా దక్షిణాఫ్రికా తో సూపర్ 8 మ్యాచ్ లో పోటీ పడింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. మరోవైపు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పిచ్ మొత్తాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. నల్ల మట్టి తో నింపి.. పరుగులు వచ్చే విధంగా చేశారు. దీంతో ఈ మైదానంలో యావరేజ్ స్కోర్ 200గా నమోదవుతుందని క్యూరేటరు చెబుతున్నారు.