Gambhir backs Shubman Gill: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సింహభాగం లభిస్తుందని అంటారు. ఈ సామెత టీమిండియా టి20 వైస్ కెప్టెన్ గిల్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. మిగతా ఫార్మాట్ ల లో గిల్ తన సమర్ధతను నిరూపించుకున్నాడు. కానీ టీ20 లో అంచనాలను అందుకోలేకపోతున్నాడు. దారుణమైన ఆటతీరుతో విమర్శలను మూట కట్టుకుంటున్నాడు. అసలు ఇలా విఫలమవుతున్న ఆటగాడికి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారో బోర్డు పెద్దలకు తెలియాలి.
గడచిన కొన్ని ఇన్నింగ్స్ ల పరంగా చూసుకుంటే గిల్ అంత గొప్పగా బ్యాటింగ్ చేయలేదు. కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించలేదు. గిల్ తో పోల్చి చూస్తే సంజు శాంసన్ అద్భుతమైన ఆటగాడు. రింకూ సింగ్ కూడా అత్యంత ప్రమాదకరమైన ప్లేయర్. అయితే గిల్ కోసం సంజు శాంసన్ ను గౌతమ్ గంభీర్ రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడికి దక్షిణాఫ్రికా జట్టు మీద అద్భుతమైన రికార్డు ఉంది. దానిని దృష్టిలో పెట్టుకొని అవకాశాలు ఇవ్వాల్సింది పోయి.. గౌతమ్ గంభీర్ అతడిని రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేస్తున్నాడు. వచ్చిన అవకాశాలను గిల్ ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.
దక్షిణాఫ్రికా t20 సిరీస్ లో అతడు తొలి మ్యాచ్లో నాలుగు పరుగులు చేశాడు. రెండో మ్యాచ్లో ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు. మూడో మ్యాచ్లో 28 పరుగులు చేశాడు. అది కూడా అత్యంత కష్టంగా బ్యాటింగ్ చేశాడు. యాన్సన్ బౌలింగ్లో ఫుట్ వర్క్ సరిగ్గా లేకపోవడంతో గిల్ ఔట్ అయ్యాడు. గిల్ కోసం గౌతమ్ గంభీర్ బుమ్రా ను వైస్ కెప్టెన్సీ నుంచి పీకేశాడు. రింకు సింగ్ ను జట్టు నుంచి పక్కన పెట్టాడు. సంజు శాంసన్ ను రిజర్వ్ బెంచ్ పరిమితం చేశాడు. వాషింగ్టన్ సుందర్ పరిస్థితి కూడా అలానే చేశాడు. ఇలా ఇంత మందిని బలిపెట్టినప్పటికీ గిల్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇలా గిల్ వరుసగా విఫలమౌతున్నప్పటికీ అవకాశాలు రావడం.. పైగా అతడే వైస్ కెప్టెన్ కావడం.. అన్నిటికంటే ముఖ్యంగా ఓపెనర్ గా ప్రమోషన్ ఇవ్వడం పట్ల.. గౌతమ్ గంభీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హార్దిక్ పాండ్యా దేశవాళి క్రికెట్లో తనను తాను నిరూపించుకున్న తర్వాతే జట్టులో అవకాశం ఇచ్చారు. కానీ గిల్ విషయంలో మాత్రం మేనేజ్మెంట్ ఎక్కడా లేని ఉదాసీనత చూపుతోంది.
SANJU SAMSON CAREER DESTROYED
Gautam Gambhir and Vacation Man Ajit Agarkar
-Removed Bumrah from VC
-Dropped Rinku from the squad
-Now they have even dropped Sanju from the T20 playing XI
All just to accommodate Shubman Gill as an opener#INDvSA pic.twitter.com/ORlwMdiwPz— kuldeep singh (@kuldeep0745) December 14, 2025