Anchor Shyamala politics: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీలో కొందరు చేస్తున్న పనులు పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. చాలామంది నేతలు ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ మాత్రం పక్క రాష్ట్రాల్లో చేస్తున్నారు. అధినేత జగన్మోహన్ రెడ్డి వారంలో మూడు రోజులు పాటు తాడేపల్లి కి వచ్చి పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. మిగతా నాలుగు రోజులు బెంగళూరుకు పరిమితం అవుతున్నారు. అయితే ఆయనను చూసి ఇప్పుడు కొత్తగా యాంకర్ శ్యామల లాంటి వారు సైతం ఏపీని తొంగి చూడడం లేదు. హైదరాబాదులో ఉంటూ ప్రత్యేక వీడియోలు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై అధికార ప్రతినిధి హోదాలో ఇలా వీడియోలు తీసి మీడియాకు అందిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతవరకు ఓకే కానీ.. ఏకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను సైతం హైదరాబాదులోనే.. అది కూడా తాను నివాసం ఉంటున్న కూకట్పల్లి ప్రాంతంలోనే నిర్వహిస్తుండడం మాత్రం కాస్త అతిగా మారుతుంది.
హైదరాబాదులో ఉంటూ..
సోషల్ మీడియా( social media) వచ్చాక రాజకీయ పార్టీల తీరు మారింది. ఆ పార్టీ కార్యక్రమాల తీరు కూడా మార్చేశారు. ఎక్కడో విదేశాల్లో ఉంటే సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాకు జత చేస్తున్నారు. మెయిన్ మీడియా కూడా అదే వీడియోను ప్రసారం చేసి వారికి ఎనలేని ప్రచారం కల్పిస్తోంది. అయితే పెద్ద నేతలు వరకు ఓకే కానీ అధికార ప్రతినిధి హోదాలో.. పనిచేస్తున్న యాంకర్ శ్యామల లాంటి వారు కూడా ఇలా చేయడం ఏంటి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రశ్న వినిపిస్తోంది. పైగా ఆమెకు ఆర్థిక ప్రయోజనం ఉందన్న టాక్ ఉంది. జీతాల రూపంలో సేవలు అందిస్తున్నారు అన్న మాట వినిపిస్తోంది.
ఆందోళనలు సైతం అక్కడే..
ఇటీవల పిన్నెల్లి బ్రదర్స్ అరెస్టయ్యారు. అయితే ఆమెకు ఆ విషయం తెలియదు అన్నట్టు ఉంది. వారు రెండు రోజుల క్రితం అరెస్టు అయితే.. ఆమె నిన్ననే కారుమూరి వెంకటరెడ్డి అనే నేత కలిసి కూకట్పల్లిలో ఆందోళన చేశారు. అంతకు ముందు కూడా ఆమె ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఒక ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు హైదరాబాదులో. అక్కడే సంతకాల సేకరణ చేపట్టారు. అయితే ఆమె ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ హైదరాబాదులో ఉంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తన బుల్లితెర కెరీర్ ను వదులుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి కొంత మొత్తం జీతం అందుకుంటున్నారన్న టాక్ ఉంది. అందుకే కాబోలు హైదరాబాదు నుంచి తన రాజకీయాలను సాగిస్తున్నారు. అయితే తమకు అలాంటి అవకాశం కల్పించాలని ఇప్పుడు వైసీపీ నేతలు పార్టీ హై కమాండ్ ను కోరుతున్నారు. ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయం చేస్తాము అంటూ సెటైర్లు వేస్తున్న వారు ఉన్నారు.