shubman gill : టీమిండియా టెస్ట్ జట్టు సారథి గిల్ చరిత్ర సృష్టించాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో గిల్ కు ఇది నాలుగో సెంచరీ. తొలి టెస్ట్ లో గిల్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత రెండవ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేశాడు. ఇక రెండవ ఇన్నింగ్స్ లోనూ శతకం సాధించాడు. తద్వారా తన పేరు మీద సరికొత్త రికార్డులను సృష్టించుకున్నాడు. ఇంగ్లాండ్ లో పర్యటించడానికి ముందు గిల్ మీద అంతగా అంచనాలు ఉండేవి కాదు. గతంలో గిల్ ఇంగ్లాండ్ జట్టు పై ఆడిన మ్యాచ్ లలో అంతగా ప్రభావం చూపించలేకపోయాడు.
ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో గిల్ అదరగొడుతున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.. తొలి టెస్ట్ లో సెంచరీ చేసిన అతడు.. రెండవ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు.. తృటిలో త్రిబుల్ సెంచరీని కోల్పోయాడు. ఇక రెండవ ఇన్నింగ్స్ లోనూ గిల్ అదరగొట్టాడు. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇంగ్లాండు బౌలర్లను ఉతికి ఆరేశాడు.. రిషబ్ పంత్ తో కలిసి నాలుగో వికెట్ కు శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్ కు భారీ భాగస్వామ్యాన్ని నిర్మించాడు.. రెండవ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లోనూ సెంచరీ చేయడం ద్వారా గిల్ సరికొత్త రికార్డు సృష్టించాడు.
టెస్ట్ ఫార్మాట్లో టీమ్ ఇండియా సారధిగా రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు చేసిన ఆటగాడిగా గిల్ రికార్డు సృష్టించాడు. 1978లో కోల్ కతా వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో సునీల్ గవాస్కర్ టీమిండియా సారధిగా రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు చేశాడు. 2014లో కంగారు జట్టుతో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో నాటి టీమిండియా సారథి విరాట్ కోహ్లీ 2 ఇన్నింగ్స్ ల లోనూ సెంచరీలు చేశాడు..ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ప్రస్తుత సిరీస్లో టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ రెండు ఇన్నింగ్స్ లలోనూ సెంచరీలు చేశాడు.. ఇక తొలి రెండు టెస్టులలో మూడుకు మించి సెంచరీలు చేసిన రెండవ ఆటగాడిగా గిల్ కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు.. విజయ్ హజారే, జాకీ మెక్ గ్లో, గ్రెగ్ చాపెల్, సునీల్ గవాస్కర్, కుక్, స్మిత్, ధనుంజయ డిసిల్వా వంటి కెప్టెన్లు రెండు సెంచరీలతో తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు.
ప్రస్తుత సీజన్లో గిల్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతున్నాడు. ముఖ్యంగా చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తున్న అతడు.. ఇబ్బంది పెట్టే బంతులను అత్యంత ఏకాగ్రతతో ఆడుతున్నాడు. అందువల్లే ఇంగ్లాండ్ బౌలర్లకు అతడు కొరకరాని కొయ్యగా మారిపోయాడు. చాప కింద నీరు లాగా పరుగులు తీస్తూ.. బలమైన ఇన్నింగ్స్ లు నిర్మిస్తూ ఆకట్టుకుంటున్నాడు. సారధిగా తన ఎంపిక నూటికి నూరుపాళ్ళు సరైనదని నిరూపిస్తున్నాడు. ఇక ప్రస్తుత సిరీస్ లో గిల్ 500 పరుగులు పూర్తి చేసుకోవడం విశేషం.