Vaibhav Suryavanshi : ఐపీఎల్ లో అదరగొట్టాడు. గొప్ప గొప్ప బౌలర్లను సైతం ఇబ్బంది పెట్టాడు. పట్టుమని 15 సంవత్సరాల వయసు కూడా లేకుండానే మైదానంలో విధ్వంసాన్ని సృష్టించాడు. అయితే ఇది ఐపీఎల్ వరకే అని అందరూ అనుకున్నారు. కానీ అదంతా తప్పని.. తాను ఊర మాస్ అని నిరూపించుకుంటున్నాడు టీమిండియా యువ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ. మైదానంలో పరుగుల వరద పారిస్తూ.. అండర్ 19 లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. 15 సంవత్సరాల వయసు కూడా లేకుండానే ఇంగ్లీష్ గడ్డమీద పరుగుల వరద పాలిస్తున్నాడు. అంతేకాదు యూత్ వన్డేలలో కేవలం 52 బంతులను శతకం సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు . ఇప్పటివరకు కామ్రాన్ గులాం పేరు మీద ఉన్న రికార్డును సూర్య వంశీ బద్దలు కొట్టాడు. అంతేకాదు తాజా సెంచరీ ద్వారా భారత జట్టుకు సిరీస్లో లీడ్ అందించాడు.
నాలుగో వన్డే లో వైభవ్ సూర్య వంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 190 కి పైగా స్ట్రైక్ రేట్ తో సెంచరీ చేశాడు.. ఇక ఇప్పటివరకు ఈ సిరీస్ లో ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ వైభవ్ సూర్య వంశీ 40 పరుగుల మార్కును అందుకున్నాడు. వూస్టర్ న్యూ రోడ్డు మైదానంలో నాలుగో వన్డే జరగగా.. అందులో అదరగొట్టాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే అతడు విధ్వంసం సృష్టించాడు.. 52 బంతులు ఎదుర్కొన్న అతడు 10 ఫోర్లు, ఏడు సిక్సర్ల సహాయంతో శతకం సాధించాడు. అంతే కాదు యూత్ వన్డే లో అత్యంత స్పీడ్ సెంచరీ సాధించాడు. ఇంత వేగంగా యూత్ వన్డేలలో ఏ ఆటగాడు కూడా సెంచరీ చేయలేకపోయాడు.. ఈ లిస్టులో వైభవ్ ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. 2013లో ఇంగ్లాండ్ జట్టుపై కమ్రాన్ గులాం 53 బంతుల్లో సెంచరీ చేశాడు. అప్పట్లో ఇది రికార్డు గా నిలిచింది.. ఇక బంగ్లాదేశ్ ఆటగాడు తమిళ్ ఇక్బాల్ కూడా 2005 -06 కాలంలో ఇంగ్లాండ్ జట్టుపై 68 బాల్స్ లోనే సెంచరీ చేశాడు.. ఇక మన దేశానికి చెందిన రాజ్ అంగద్ 2021-22 లో ఉగాండా జట్టుపై 69 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇక ఆస్ట్రేలియా ఆటగాడు మార్ష్ 2001-2002 లో కెన్యా జట్టుపై సెంచరీ చేశాడు..
ఇక ఈ నెల రెండో తేదీన నార్తాంప్టన్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో కూడా వైభవ్ 31 బంతుల్లోనే 86 రన్స్ చేశాడు. అతడు ఇన్నింగ్స్ లో 9 సిక్సర్లు ఉండగా.. ఆరు ఫోర్లు ఉన్నాయి. ఆ మ్యాచును వర్షం వల్ల 40 ఓవర్లకు కుదించారు. అయినప్పటికీ భారత్ 269 రన్స్ టార్గెట్ ను 34.3 ఓవర్లలో ఫినిష్ చేసింది. ఈ మ్యాచ్ లోకి గెలవడం ద్వారా భారత్ లీడ్ 2-1 కి పెరిగింది. చివరి మ్యాచ్ లో కూడా వైభవ్ ఇదే జోరు కొనసాగిస్తే టీమ్ ఇండియా 3-1 తేడాతో సిరీస్ గెలుచుకోవడం ఖాయం.
VAIBHAV SURYAVANSHI – FASTEST HUNDRED IN YOUTH ODI HISTORY…!!! pic.twitter.com/ROtiDH6NZj
— Johns. (@CricCrazyJohns) July 5, 2025