Honda: భారత మార్కెట్లో హోండా తన కస్టమర్లకు జూలై 2025లో అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. కంపెనీ తమ వివిధ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా పాపులర్ సెడాన్ కారు హోండా సిటీ పై కూడా బంపర్ తగ్గింపు లభిస్తోంది. హోండా సిటీపై కంపెనీ ఎంత డిస్కౌంట్ ఇస్తోంది..ఎన్ని రోజులు ఈ ఆఫర్ ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.
Also Read: చివరికి డిజిటల్ లోనూ శ్రమదోపిడేనా? అందుకే ఉద్యోగులు వెళ్ళిపోతున్నారా? ఆ మేనేజ్మెంట్ ఇక మారదా?
భారతదేశంలో బాగా పాపులర్ అయిన సెడాన్ కారు హోండా సిటీపై కంపెనీ ఏకంగా రూ.1.07 లక్షల వరకు భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఈ కారును కొనాలనుకుంటే ఒకసారి దగ్గర్లోని డీలర్‌షిప్‌కు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. హోండా సిటీ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 121 హెచ్‌పీ పవర్‌ను, 145 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, 7-స్టెప్ సీవీటీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మార్కెట్లో ఈ కారు వోక్స్‌వ్యాగన్ వర్టస్, మారుతి సియాజ్, స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నా వంటి కార్లతో పోటీ పడుతుంది.
ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఈ కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది డ్రైవింగ్‌ను మరింత స్మార్ట్‌గా, ఎంజాయ్ చేసే విధంగా మారుస్తుంది. సౌకర్యాన్ని పెంచడానికి క్రూజ్ కంట్రోల్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి లేటెస్ట్ సేఫ్టీ టెక్నాలజీలు ఇచ్చారు. ఇవి డ్రైవింగ్‌ను మరింత సేఫ్టీగా చేస్తాయి.
వీటితో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, లెదర్ అప్‌హోల్‌స్ట్రీ, రెయిన్-సెన్సింగ్ వైపర్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది 5 సీటర్ కారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.12.28 లక్షల నుండి రూ.16.55లక్షల వరకు ఉంటుంది.