IND vs NZ: అతడు ఫీల్డింగ్ చేస్తే మామూలుగా ఉండదు. బంతిని ఆపడానికి శరీరాన్ని 360 డిగ్రీలకు మించి వంచుతాడు. క్యాచ్ పడితే కచ్చితంగా బ్యాటర్ అవుట్.. డైవ్ చేస్తే కచ్చితంగా బంతి ఆగుతుంది. అతడు మిడాన్.. మిడ్ ఆఫ్.. లాంగ్ ఆన్ ప్రాంతాలలో ఫీల్డింగ్ చేస్తే బంతి సెంటీమీటర్ దూరం పోవడానికి కూడా అవకాశం ఉండదు. ఈ కాలపు జాంటీ రోడ్స్ అని అతడిని పిలుచుకుంటారు. కాకపోతే అతడు ఆడుతున్నది న్యూజిలాండ్ జట్టుకు.
ప్రస్తుతం టీమిండియా, న్యూజిలాండ్ టి20 సిరీస్ ఆడుతున్నాయి. తొలి మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టు 225 పరుగులు చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఇండియా ఫినిష్ చేసింది. ఇండియా ఆస్థాయిలో గెలవడానికి ప్రధాన కారణం నమన్ దీర్. ఈ యంగ్ ప్లేయర్ న్యూజిలాండ్ బౌలర్ల బౌలింగ్ మొత్తాన్ని ఊచ కోత కోశాడు. కనికరం అనేది తెలియకుండా బంతిని గట్టిగా కొట్టాడు. సిక్సర్లతో.. ఫోర్ లతో వీర విహారం చేశాడు. వాస్తవానికి ఈ మ్యాచ్లో నమన్ నిలబడకపోతే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది.
వాస్తవానికి న్యూజిలాండ్ ఈ స్థాయిలో స్కోర్ చేయడానికి ప్రధాన కారణం ఫిలిప్స్ (82*). మిడిల్ ఆర్డర్లో వచ్చిన ఇతడు చివరి వరకు నిలబడ్డాడు.. సెల్ ఫెర్ట్ (24), ఆలెన్ (45), మిచల్ (28) పరుగులు చేశారు. అయితే ఫిలిప్స్ మాత్రం ఏకంగా 82 పరుగులు చేసి అదరగొట్టాడు. అది కూడా 40 బంతుల్లోనే.. అతడి ఇన్నింగ్స్ లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇక రెండవ మ్యాచ్లో కూడా ఫిలిప్స్ అదే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్లు సెల్ ఫెర్ట్(7), అలెన్ (18) పరుగులు మాత్రమే చేశారు. మిచెల్ ఆరు పరుగులపై అవుట్ అయ్యాడు. ఈ దశలో ఫిలిప్స్ (70), జాకబ్స్ (60*) అదరగొట్టారు.
న్యూజిలాండ్ జట్టు తొలి వికెట్ తొమ్మిది పరుగుల వద్ద.. రెండో వికెట్ 18 పరుగుల వద్ద.. మూడో వికెట్ 41 పరుగుల వద్ద కోల్పోయింది. ఈ దశలో నాలుగో వికెట్ కు ఫిలిప్స్, జాకబ్స్ 116 పరుగులు జోడించారు. తద్వారా న్యూజిలాండ్ ఈ కథనం రాసే సమయం వరకు 18.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. టీమిండియాలో భువనేశ్వర్ కుమార్ ఒకటి.. అర్ష్ దీప్ సింగ్ రెండు.. ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఫిలిప్స్ తొలి మ్యాచ్లో 80.. ఈ మ్యాచ్ లో 70 పరుగులు చేసి తన తిరుగులేని ఫామ్ నిరూపించుకున్నాడు.
Sixx from Glenn Phillips #NZvIND https://t.co/1z78uvfY6K
— Cricket Blaze (@CricketBlaze45) October 24, 2026