Renu Desai
Renu Desai : రేణు దేశాయ్ సోషల్ యాక్టివిస్ట్. అలాగే యానిమల్ లవర్. జీవ హింసకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతూ ఉంటారు. తాజాగా ఆమె దేశ ప్రజలకు ఓ కీలక సూచన చేశారు. చైనా వస్తువులను బహిష్కరించాలని ఆమె వేడుకున్నారు. మీకు దేశ భద్రత, మీ కుటుంబ భద్రత పట్ల బాధ్యత ఉంటే చైనా వస్తువులను కొనడం మానేయండి. అందుకు బదులు మన దేశ వస్తువులను కొనండి. నేను గతంలో చైనా వస్తువులను కొన్నాను. ఇప్పుడు మానేశాను. ప్రతి వస్తువుకు కొనే ముందు లేబుల్ చూసి కొంటున్నాను. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ. కానీ ఇప్పటి నుండి అయినా ప్రారంభింద్దాం… అని సోషల్ మీడియాలో కామెంట్ పోస్ట్ చేసింది.
Also Read : పవన్ కళ్యాణ్ అవి రహస్యంగా చేస్తాడు… ఆసక్తి రేపుతున్న రేణు దేశాయ్ లేటెస్ట్ కామెంట్స్
ఈ పోస్ట్ అందరికీ షేర్ చేయండి. మన దేశం గురించి మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు. అర్థం లేని టీవీ రియాలిటీ షోల గురించి మాట్లాడుకోవడం కంటే, మన దేశ పరిస్థితులను చర్చించడం మంచిది.. అని రేణు దేశాయ్ సదరు పోస్ట్ లో వెల్లడించారు. భారత్ కు చైనా సైతం శత్రుదేశంగా ఉంది. ఇండియా ఎదుగుదలను చైనా ఓర్వలేదు. పైగా మన చిరకాల శత్రువు పాకిస్థాన్ కి చైనా తన మద్దతు ప్రకటిస్తుంది. ఈ క్రమంలో మేడ్ ఇన్ చైనా వస్తువులను బహిష్కరించడం ద్వారా, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయాలనే ఉద్దేశంతో రేణు దేశాయ్ ఈ పోస్ట్ పెట్టారు.
మరోవైపు రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఆమెకు ఒక కీలక రోల్ చేసింది. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇక కుమారుడు అకీరా నందన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. త్వరలో ఆయన హీరోగా మారే అవకాశం ఉంది. ఫిల్మ్ మేకింగ్ లో కోర్స్ చేసిన అకీరాకు మ్యూజిక్ మీద కూడా పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అయిన నేపథ్యంలో అకీరా హీరో కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అకీరా బయట కనబడితే ఆయనతో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు విడుదలకు సిద్ధం అవుతుంది. ఓజీ షూటింగ్ సైతం తిరిగి ప్రారంభం అయ్యింది.
Also Read : ఇలాంటి దుర్మార్గులకు దూరంగా ఉండాలి..కఠినంగా శిక్షించాలి అంటూ రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్!
Web Title: Renu desai requests stop doing that