IPL 2024: మరో మూడు రోజుల్లో ఐపీఎల్ 17 ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని అన్ని జట్లు సమాయత్త మవుతున్నాయి. 17వ ఎడిషన్ లో భాగంగా తొలి మ్యాచ్ బెంగళూరు, చెన్నై జట్ల మధ్య జరగనుంది. ప్రారంభం మ్యాచ్ కావడంతో అభిమానులు టికెట్ల కోసం ఎగబడుతున్నారు. తొలి మ్యాచ్ జరిగే చిన్న స్వామి స్టేడియంలో టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయని తొలి మ్యాచ్ జరిగే చిన్న స్వామి స్టేడియంలో టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇక తొలి మ్యాచ్ చెన్నై జట్టుతో జరగనున్న నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కీలక అప్డేట్స్ ఇస్తోంది.
మంగళవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోకి విరాట్ కోహ్లీ అడుగుపెట్టిన దృశ్యాలను ఆర్సీబి తన అఫీషియల్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. King in is kingdom. Virat is back in chinnaswamy stadium అంటూ కామెంట్ చేసింది.. రాయల్ ఛాలెంజర్స్ అఫీషియల్ జెర్సీ ధరించి.. తన స్పోర్ట్స్ కిట్ బ్యాగ్ మోసుకుంటూ.. షూస్, గాగూల్స్ ధరించి స్టేడియంలోకి అడుగుపెడుతున్న దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి.. వీటిని చూసిన అభిమానులు కేరింతలు కొడుతున్నారు. ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లీకి, బెంగళూరు జట్టుకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఐపీఎల్ 2008లో ప్రారంభం కాగా ఇప్పటివరకు బెంగళూరు జట్టు ఒక ట్రోఫీ కూడా అందుకోలేకపోయింది. విరాట్ లాంటి ఆటగాడు ఉన్నప్పటికీ ఆ జట్టును ప్రతిసారీ దురదృష్టమే వెంటాడుతోంది. ఇటీవల జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ లో బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. స్మృతి మందాన సేన ఢిల్లీ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. కప్ తో పాటు ఆరు కోట్ల ప్రైజ్ మనీ కూడా అందుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి పురుషుల జట్టు కూడా ట్రోఫీ సాధించాలని బెంగళూరు అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సాలా కప్ నమ్దే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, విరాట్ కోహ్లీ ఫోటోలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పోస్ట్ చేసిన నేపథ్యంలో.. అవి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
King in his Kingdom
Virat is back in Chinnaswamy
Johnnie Walker presents #RCBUnbox powered by @kotak_life and @Duroflex_world has just begun!#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 (1/2) pic.twitter.com/HkJr1dS2Lc
— Royal Challengers Bangalore (@RCBTweets) March 19, 2024