Champions Trophy IND vs NZ : ఆరోజుల్లో 264 పరుగులు అంటే భారీ స్కోర్ కింద లెక్క.. ఆ మ్యాచ్లో కెప్టెన్ గంగూలీ(117) సూపర్ సెంచరీ తో అదరగొట్టాడు. సచిన్ టెండూల్కర్ (69) తన మాస్టర్ ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే 2/55, వెంకటేష్ ప్రసాద్ 3/27 గణాంకాలు నమోదు చేశారు. వీరిద్దరి ధాటికి న్యూజిలాండ్ 132 పరుగులకే ఐదు వికెట్లు నష్టపోయింది. పీకల్లోతు ఇబ్బందుల్లో పడింది. న్యూజిలాండ్ గెలవాలంటే మరో 130 కి పైగా పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీవీలకు అతుక్కుపోయిన సగటు క్రికెట్ అభిమానులు భారత జట్టుదే విజయం అని భావించారు.. ఈ దశలో న్యూజిలాండ్ ఆల్రౌండర్లు క్రిస్ కెయిన్స్(102), క్రిస్ హారిస్(46) అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో భారత జట్టుకు కప్ దూరమైంది.. ఆ తర్వాత 2019 వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టును సెమీఫైనల్ లో న్యూజిలాండ్ ఓడించింది.. 239 పరుగుల టార్గెట్ టీం ఇండియా ముందు ఉంచిన న్యూజిలాండ్.. ఆ తర్వాత భారత జట్టును ఓటమిపాలు చేసింది. 2019 -21 కాలంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్ ఫైనల్ లో టీమిండియా న్యూజిలాండ్ ఓడించింది. 2021 మార్చి 6న జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఏకంగా ఆరు వికెట్ల తేడాతో టీ మీడియా పై విజయం సాధించింది. ఇక గత ఏడాది అక్టోబర్ – నవంబర్ కాలంలో భారత జట్టుతో మూడు టెస్టులు ఆడిన న్యూజిలాండ్..0-3 తేడాతో టీమ్ ఇండియాను ఓడించింది. టీమ్ ఇండియాలో సొంత దేశంలో టెస్టుల్లో క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.
Also Read : లీగ్ దశలో ఓడిందని.. తేలిగ్గా చూడొద్దు.. న్యూజిలాండ్ అంటేనే పక్కలో బల్లెం
నిర్లక్ష్యం వద్దు
2000 సంవత్సరంలో జరిగిన నాకౌట్ టోర్నీలో భారత జట్టుకు.. ప్రస్తుత భారత జట్టుకు ఏమాత్రం సంబంధం లేదు. పైగా ఇప్పుడు నెంబర్ -8 వరకు భారత ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక బౌలర్ల విషయంలోనూ అదే తీరు కొనసాగుతోంది. ఒకరు లేదా ఇద్దరు బ్యాటర్లు విఫలమైనప్పటికీ.. ఏమాత్రం ఇబ్బంది పడకుండా జట్టును ఆటగాళ్లు గెలిపిస్తున్నారు.. మరోవైపు నలుగురు స్పిన్నర్లు పటిష్టంగా బౌలింగ్ చేస్తూ టీమ్ ఇండియాకు వరుస విజయాలు అందించారు. వరుస విజయాలతోనే టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ దాకా వచ్చింది. ఫైనల్ పోరులో న్యూజిలాండ్ జట్టును అడ్డుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటికే లీగ్ దశలో న్యూజిలాండ్ జట్టును భారత్ ఓడించింది. అయితే న్యూజిలాండ్ జట్టులో ఏ క్షణమైనా మ్యాచ్ ను మలుపు తిప్పే ఆటగాళ్లు ఉన్నారు. ఫలితం ఎలాంటిది వచ్చిన ఇబ్బంది లేకుండా చివరి బంతి వరకు ఆడే నైపుణ్యం న్యూజిలాండ్ ఆటగాళ్ల సొంతం. 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ఎలా ఆడిందో భారత జట్టుకు అనుభవమే. అందువల్లే ఒక అవకాశం కూడా ఇవ్వకుండా ఫైనల్ మ్యాచ్లో రోహిత్ సేన ఆడాల్సి ఉంటుంది. అంతేకాదు ఫైనల్ ఫెయిల్ అనే ముద్రను టీమిండియా ఆటగాళ్లు చెరిపేసుకోవాల్సి ఉంటుంది.. బౌలింగ్ విషయంలో రాజీ పడొద్దు. బ్యాటింగ్ విషయంలో ముందు చూపును మర్చిపోవద్దు. ఫీల్డింగ్ విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఈ మూడు విభాగాలతో పాటు సమయమనాన్ని కోల్పోవద్దు. ఇవన్నీ పాటించినప్పుడే టీం ఇండియా న్యూజిలాండ్ పై గెలవగలుగుతుంది. సగర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీని అందుకోగలుగుతుంది.
Also Read : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముందు న్యూజిలాండ్ జట్టుకు కోలు కోలేని షాక్..