Prabhas : చాలా కాలం నుండి రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ఆరోగ్య పరిస్థితులపై అనేక రకాల ప్రచారాలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ సమయంలో ప్రభాస్ కాళ్లకు తీవ్రమైన గాయాలు అయ్యాయి అని, అందుకే ఆయన షూటింగ్స్ కి విరామం ఇచ్చి విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడని ఇలా పలు రకాల రూమర్స్ వినిపించాయి. ప్రభాస్ విదేశాల్లో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న విషయం వాస్తవమే, కానీ ఆయనకు గాయాలు అయ్యాయో లేదో ఎవరికీ క్లారిటీ గా తెలియదు. అంతే కాకుండా రీసెంట్ గా ఆయన ఆయన పైన నుండి క్రింద పడిపోయాడని, బాగా గాయాలు అయ్యాయి అంటూ కూడా వార్తలు వినిపించాయి. అభిమానులు ఈ వార్తలపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసారు. తమ అభిమాన హీరో ఎలా ఉన్నాడో ఏంటో అని ఆయన పీఆర్ టీం ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో ప్రసంగించారు.
Also Read : ప్రభాస్ కి ఇది కొత్తగా వచ్చిన అలవాటు కాదు… అసలు విషయం లీక్ చేసిన హీరోయిన్!
దీనికి వెంటనే స్పందించిన ప్రభాస్ పీఆర్ టీమ్ ‘సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నట్టు ప్రభాస్ కాళ్లకు గాయాలు అయ్యాయి అనడంలో ఎలాంటి నిజం లేదు. ఆయన చాలా ఆరోగ్యంగానే ఉన్నారు. రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అసత్య ప్రచారాలను నమ్మి అభిమానులు కంగారు పడొద్దు. ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేసేవారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయి. దయచేసి గమనించగలరు’ అంటూ ప్రభాస్ టీం స్ట్రాంగ్ మెసేజ్ ని అభిమానులకు అందించింది. దీంతో ప్రభాస్ ఆరోగ్యం పై వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది. ప్రస్తుతం ప్రభాస్, హను రాఘవపూడి(Hanu Raghavapudi) తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఇటీవలే సెట్స్ లోకి అడుగుపెట్టిన ప్రభాస్, నాన్ స్టాప్ గా ఈ షెడ్యూల్స్ లో పాల్గొంటున్నాడు. ఇందులో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా, ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇమాన్వి అనే కొత్త హీరోయిన్ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుంది.
Also Read : ప్రభాస్ పుణ్యమాని కన్నప్ప కి భారీ బిజినెస్ జరుగుతుందా..?