Lagacharla Industrial Park
Lagacharla : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా అనే వ్యవస్థను తెరపైకి తీసుకువచ్చింది. మొదట్లో హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల నుంచి ఆమోదం లభించింది. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా పడగొట్టడంతో ప్రజల నుంచి సానుకూలత వ్యక్తం అయింది. కానీ అదే హైడ్రా ఇతర నిర్మాణాల మీద పడినప్పుడు.. ఆక్రమణలను తొలగించినప్పుడు మాత్రం ప్రజలనుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. అందువల్లే హైకోర్టు హైడ్రా అధిపతి రంగనాథ్ ను ప్రశ్నించింది. ఇలాంటి చర్యలు ఇంకోసారి తీసుకుంటే బాగుండదని మండిపడింది. అమీన్పూర్ చెరువు, ఇతర ఆక్రమణల విషయంలో హైడ్రా వ్యవహరించిన తీరు హైకోర్టు ఆక్షేపణలకు కారణమైంది. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.
Also Read : రేవంత్‌రెడ్డిని బీజేపీలోకి కలిపేస్తారా ఏంటి?
లగచర్ల విషయంలో..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల, హకీంపేట ప్రాంతంలో భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. ఏర్పాటు చేయబోయే ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా కొంతమంది ఉద్యమాలు చేశారు. అయితే ఇందులో చాలామంది భారత రాష్ట్ర సమితికి చెందినవారు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వారే కలెక్టర్ పై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నది. అయితే అక్కడ పారిశ్రామిక కారిడార్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అనేక పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి.. ఇక ఆయా ప్రాంతాలలో భూసేకరణ జరుగుతున్నప్పుడు ప్రజలు ఆందోళనలు చేశారు. ఆ సమయంలో పలువురిపై కేసులు నమోదయ్యాయి. హైకోర్టు లగచర్ల ప్రాంతంలో, హకీంపేట ప్రాంతంలో భూసేకరణకు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వానికి ఒక్కసారిగా షాక్ తగిలింది. ఈ ప్రాంతాలలో ఏర్పాటు చేయబోయే కంపెనీలకు భూములు ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం రైతులను కోరింది. వారికి మెరుగైన ప్యాకేజీ ఇస్తామని.. కంపెనీలలో ఉద్యోగాలు కూడా కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ విషయాన్ని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. అయినప్పటికీ కొంతమంది దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో.. హైకోర్టు ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. హైకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని ఆసక్తికరంగా మారింది. గతంలో ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేయడంతో.. ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్ అనే విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇప్పుడు దీనిని కూడా రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.
Also Read : పోస్టుమార్టం: బీజేపీ అంజిరెడ్డి ఎందుకు గెలిచాడు.. కాంగ్రెస్ నరేందర్ రెడ్డి ఎందుకు ఓడాడు?
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Lagacharla high court cancel notification for land acquisition for industrial park in lagacharla
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com