IND vs NZ: ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దుబాయ్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా వరుసగా నాలుగు విజయాలు సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లపై లీగ్ దశలో, ఆస్ట్రేలియాపై సెమీఫైనల్ లో విజయం సాధించి ఫైనల్ లోకి అడుగు పెట్టింది. మన వైపు న్యూజిలాండ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ పై విజయాలు సాధించి ఫైనల్ లోకి ప్రవేశించింది. టీమిండియా తో తలపడిన మ్యాచ్లో ఓటమిపాలైంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లో రెండు జట్లు సమానంగా కనిపిస్తున్నాయి. రెండు జట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. అవసరమైతే వారు బ్యాట్ తో కూడా రాణించగలరు. ఇక సౌత్ ఆఫ్రికా తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఏకంగా 362 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో సౌత్ ఆఫ్రికా తడబడింది. 312 పరుగుల వద్డే ఆగిపోయింది. 50 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై విజయం సాధించిన న్యూజిలాండ్ ఫైనల్లోకి వచ్చింది.. ఫైనల్ లో టీమిండియాతో తలపడనుంది.
Also Read : దక్షిణాఫ్రికాపై మేము సెమీస్ లో గెలవడానికి టీమిండియానే కారణం: మిచెల్ సాంట్నర్
న్యూజిలాండ్ జట్టుకు షాక్
ఫైనల్లో ప్రవేశించిన న్యూజిలాండ్ జట్టుకు.. మ్యాచ్ క్ ముందుగానే షాక్ తగిలింది. సౌత్ ఆఫ్రికా తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ గాయపడ్డాడు. క్లాసెన్ క్యాచ్ అందుకునే క్రమంలో అతని భుజం నేలకు బలంగా తగిలింది. గాయం తీవ్రంగా కావడంతో అతడు వెంటనే మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. తిరిగి మళ్లీ వచ్చినప్పటికీ బౌలింగ్ చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అతడి గాయానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో టీమ్ ఇండియాతో జరిగే ఫైనల్ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే గనుక జరిగితే న్యూజిలాండ్ జట్టుకు అది కోలుకోలేని దెబ్బ. మరోవైపు అతడి గాయం తీవ్రతను పరిశీలిస్తున్నామని.. న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ అన్నాడు. సౌత్ ఆఫ్రికా తో సెమి ఫైనల్ మ్యాచ్ అయిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశాడు. ” భారత జట్టుతో జరిగే మ్యాచ్ కు ఇంకా చాలా రోజుల సమయం ఉంది. ఈలోపు శాంట్నర్ కోలుకుంటాడని ఆశిస్తున్నాం. అతనికి గాయం తీవ్రంగానే అయినప్పటికీ.. జట్టు వైద్యుల పరిశీలనలో ఉన్నాడు. అతడు కోలుకొని జట్టులోకి తిరిగి వస్తాడనే ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నామని” శాంట్నర్ పేర్కొన్నాడు. కాగా, హెన్రీ భారత జట్టుపై 21 వికెట్లను పడగొట్టాడు.
Also Read : అదృష్టం మెయిన్ డోర్ తట్టేలోపు.. దురదృష్టం బాల్కనీలో వచ్చి కూర్చుంది.. ఇదేం దరిద్రం రా అయ్యా