Boycotting match against India: చెరువు మీద అలిగితే కొంగ కడుపు మాడుతుంది. చేనుమీద అలక బూనితే పక్షులకు క్షుద్బాధ మొదలవుతుంది. అందువల్లే పెట్టే వాడి మీద కోపం పెంచుకోవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా సంపాదించుకునే స్థాయి లేనప్పుడు లేనిపోని భేషజాలకు పోవద్దు. అలా వెళ్తే మొదటికే మోసం వస్తుంది.
ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం మొత్తం పాకిస్తాన్ జట్టుకు నూటికి నూరుపాళ్ళు సరిపోతుంది. ఇండియా మీద లేనిపోని కోపంతో పాకిస్తాన్ జట్టు టి20 వరల్డ్ కప్ లో సూర్య కుమార్ యాదవ్ సేనతో ఫిబ్రవరి 15న జరిగే మ్యాచ్ లో ఆడబోమని స్పష్టం చేసింది. దీంతో పాకిస్తాన్ జట్టు మీద తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ జట్టు కు ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది. ఆడబోననే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించింది.
ఇండియాతో జరిగే మ్యాచ్ ఆడక పోవడం వల్ల పాకిస్తాన్ జట్టుకు అన్ని విధాలుగా నష్టమని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.. ఇప్పటికే టీమిడియాకు ఐసీసీ సపోర్టు ఉంది. దీనికి తోడు పాకిస్తాన్ ఐసీసీ చెప్పిన మాటలను వినడం లేదు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ నియత్రణ మండలి పాకిస్తాన్ జట్టు మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం గా ఉంది. మరోవైపు బీసీసీఐకి, ఐసీసీకి మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని.. బిసిసిఐ చెప్పినట్టు ఐసీసీ వింటున్నదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వితండ వాదానికి దిగుతోంది.
ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా టీమిండియా, పాకిస్తాన్ ఆడాలి. ఈ మ్యాచ్ ను పాకిస్తాన్ ప్రభుత్వం బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించడంతో పాకిస్తాన్ దగ్గర జట్టుకు దాదాపు ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మ్యాచ్ ఆడక పోవడం వల్ల పాకిస్తాన్ జట్టు రెండు పాయింట్లు నష్టపోతుంది. ఈ రెండు పాయింట్లు వల్ల టీమిండియా ఏకంగా సెమీస్ దాకా వెళ్తుంది. ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఆడే మ్యాచ్లలో ఓటమిపాలైతే టోర్నీ నుంచి నిష్క్రమించవచ్చు.