Homeహెల్త్‌Water Test For Eggs : మీరు తినే కోడిగుడ్డు నాణ్యమైనదా? కాదా? ఇలా...

Water Test For Eggs : మీరు తినే కోడిగుడ్డు నాణ్యమైనదా? కాదా? ఇలా చెక్ చేసుకోండి..

Water Test For Eggs : శరీర ఆరోగ్యానికి ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినాలని కొందరు వైద్యులు ప్రత్యేకంగా సూచిస్తున్నారు. అయితే నాణ్యమైన కోడిగుడ్డును తింటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వీటిలో కల్తీ ఉంటే ఆరోగ్యానికి బదులు కొత్త రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత కాలంలో చాలా గుడ్లు నాణ్యతలేనివిగా మార్కెట్లోకి వస్తున్నాయి. కొంతమంది ఇవి ఎలా ఉన్నాయో తెలుసుకోకుండానే వాటిని తింటున్నారు. అయితే ఇటీవల కోడిగుడ్డు నాణ్యంగా ఉందో లేదో ‘వాటర్ టెస్ట్’ద్వారా తెలుసుకొని వాడుకోవాలని […]

Water Test For Eggs : శరీర ఆరోగ్యానికి ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినాలని కొందరు వైద్యులు ప్రత్యేకంగా సూచిస్తున్నారు. అయితే నాణ్యమైన కోడిగుడ్డును తింటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వీటిలో కల్తీ ఉంటే ఆరోగ్యానికి బదులు కొత్త రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత కాలంలో చాలా గుడ్లు నాణ్యతలేనివిగా మార్కెట్లోకి వస్తున్నాయి. కొంతమంది ఇవి ఎలా ఉన్నాయో తెలుసుకోకుండానే వాటిని తింటున్నారు. అయితే ఇటీవల కోడిగుడ్డు నాణ్యంగా ఉందో లేదో ‘వాటర్ టెస్ట్’ద్వారా తెలుసుకొని వాడుకోవాలని FSAI తెలిపింది. దీని ద్వారా గుడ్డు నాణ్యంగా ఉంటే మాత్రమే తీసుకోవాలని.. లేకుంటే వదిలేయాలని సూచించింది. అసలు ఈ టెస్ట్ ను ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

పౌష్టికాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. అవి నాణ్యంగా ఉన్నాయో? లేవో? తెలుసుకోవడం అంతే ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లోకి వచ్చే చాలా వస్తువులు కల్తీగా మారిపోతున్నాయి. దీనిపై Food Safety and Standards Authority of India (FSSAI) ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా తాజాగా కోడిగుడ్డు కల్తీ పై ఆసక్తికర విషయాలను అందించింది. కోడుగుడ్డు నాణ్యంగా ఉందో? లేదో ?ఇలా టెస్ట్ చేసి ఆ తర్వాత మాత్రమే తీసుకోవాలని తెలిపింది.

కోడిగుడ్డును నీళ్లలో వేసి అది మంచిదో? కాదో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఒక గ్లాసులో నీటిని తీసుకోవాలి. ఇందులో కోడి గుడ్డును నెమ్మదిగా వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత గుడ్డు ఎలా ఉంటుందో గమనించాలి. నీటిలో వేసిన గుడ్డు నాణ్యమైనది అయితే అడుగున వెళ్లి ఉంటుంది. కానీ కోడిగుడ్డు నాణ్యంగా లేకపోతే అది నీటిపైనే తేలియాడుతుంది. ఒకవేళ అడుగున వెళ్లినా కూడా ఇది నిటారుగా నిలబడుతుంది. దీంతో ఇది నాణ్యమైనది కాదు అని గుర్తించాలి. అయితే ఈ టెస్ట్ కోసం గాజు గ్లాస్ ని తీసుకోవడం వల్ల ఈజీగా గుర్తించవచ్చు.

కొందరు కోడిగుడ్లను ఆఫ్ బాయిల్డ్ చేసి తింటారు. ఇలా తినడం వల్ల అందులో పాడైపోయిన రసాయనాలు ఉంటే అనారోగ్యానికి గురై అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీనిని పగలగొట్టినప్పుడు ఏదైనా ప్రత్యేక వాసన వస్తే దానిని దూరం పెట్టడమే మంచిది. సాధ్యమైనంతవరకు కొన్ని గుడ్లపై అనుమానం ఉంటే వాటిని పూర్తిగా బాయిల్డ్ చేసి తీసుకోవాలి. ఆఫ్ బాయిల్డ్ చేసుకోవాల్సి వస్తే దీని నాణ్యతను పరీక్షించాలి.

అయితే కొందరు మార్కెట్ నుంచి తీసుకువచ్చిన గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా ఇవి పాయిజన్ గా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు వాడుకోవడం మంచిది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ఇంట్లో నిల్వ చేయాల్సి వస్తే సరైన ఉష్ణోగ్రతలో ఉంచడం మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper