spot_img
Homeఆధ్యాత్మికంToday 6 December 2025 Horoscope: ఈ రాశి వ్యాపారులకు గుడ్ న్యూస్.. అనుకోకుండా సంపద...

Today 6 December 2025 Horoscope: ఈ రాశి వ్యాపారులకు గుడ్ న్యూస్.. అనుకోకుండా సంపద పెరిగే అవకాశం..

Today 6 December 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై ఆర్ద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారులకు అనుకోకుండా సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : అనుకున్న పనులను ఈరోజు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితం ఉంటుంది. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకుండా ఉండాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు రాజకీయ నాయకులు అయితే ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రజల మద్దతు ఉండడంతో సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులు కొన్ని పనులు చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులు ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు అనుకోకుండా ధన లాభం ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండనుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ఎవరితోనూ వాదనలకు దిగకుండా ఉండాలి. కొన్ని రోజులపాటు కొత్త వస్తువులు కొనుగోలు చేయకపోవడమే మంచిది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు ఇంట్లో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులకు శత్రువుల బెడద ఉంటుంది. అయితే కొందరి మద్దతుతో ఈ సమస్య నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు కొన్ని ప్రాజెక్టులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టేముందు పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. లాభం కంటే ఖర్చులే అధికంగా ఉంటాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు తెలివైన ప్రతిభతో ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. వ్యాపార విస్తరణ జరగడంతో లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించడం కష్టం అవుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గతంలో చేపట్టిన కొన్ని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాజు వారు ఈరోజు ఉత్సాహంగా పని చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఆసక్తికరమైన ఆఫర్లు అందుతాయి. కొన్ని సమస్యల పట్ల ధైర్యంగా ఉండటమే మంచిది ఎదుటివారిని ఆకట్టుకోవడానికి మాటల మాధుర్యాన్ని పెంచుకుంటారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు పెద్దల ఆశీస్సులు ఉండడంతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులు కొన్ని సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఉన్నత చదువులకు అర్హత పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. వ్యాపారులకు ఈరోజు అనేక లాభాలు ఉంటాయి గతంలో కంటే ఇప్పుడు ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి లాభాలు ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper