Dhurandhar Movie Review: నటి నటులు : రణ్వీర్ సింగ్, మాధవన్, అక్షయ్ ఖన్నా తదితరులు…
డైరెక్టర్ : ఆదిత్య ధర్…
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో బాలీవుడ్ తన ఉనికిని చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తోంది. కారణం ఏంటంటే ఖాన్ త్రయం నుంచి ఇప్పుడిప్పుడే వస్తున్న యంగ్ హీరోల వరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసిన బాలీవుడ్ ఇండస్ట్రీ పూర్వ వైభవాన్ని చాటుకోలేకపోతోంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రణ్వీర్ సింగ్… ఇక ఇప్పుడు ఆయన చేసిన ‘దురంధర్’ సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది…ఈ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులకు నచ్చిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం రండి…
కథ
ఇండియా నుండి పాకిస్థాన్ విడిపోయి సెపరేట్ దేశం మారినపాటికి పాక్ ఇండియా మీద ఎప్పుడు తమ ఆధిపత్యాన్ని చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ అది ఎప్పుడు వర్కౌట్ కావట్లేదు… దాంతో ఇండియా లో అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది…1999లో జరిగిన ఐసీ 814 విమాన హైజాక్, 2001 లో భారత పార్లమెంట్ మీద ఉగ్ర దాడి తర్వాత భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటాడు. పాకిస్తాన్ లోని ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకలించడానికి దురందర్ అనే పేరుతో ఒక ఆపరేషన్ ను స్టార్ట్ చేస్తాడు.
ఇక ఈ ఆపరేషన్ లో భాగంగా పంజాబ్ లో జైలు జీవితాన్ని గడుపుతున్న ఒక వ్యక్తి హంజా (రణ్వీర్ సింగ్) ను సెలెక్ట్ చేసుకుంటారు. ఇక అతన్ని పాకిస్తాన్ కి పంపించి ఆ ఉగ్రవాదులతో పాటు కలిసి తిరిగేలా చేస్తారు…ఫైనల్ గా హంజా ఎవరనే విషయం ఆ ఉగ్రవాదులకు తెలిసిందా? వాళ్ళునతని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు. హంజా ఉగ్రవాదాన్ని అంతం చేశాడా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
డైరెక్టర్ ఆదిత్య ఈ సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ బాగుంది…కానీ దానిని ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేయడంలో కొంతవరకు తడబడ్డాడు… కారణం ఏంటంటే రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ లో వేరియేషన్స్ చూపించారు…అయినప్పటికి హీరో ఉగ్రవాదులతో కలిసి ఉండటం వల్ల ఉగ్రవాదుల మీద దాడులు చేస్తున్న హీరో వాటిని ఆపడానికి ట్రై చేయడు. రెహమాన్(అక్షయ్ ఖన్నా) పాకిస్తాన్ లోని కరాచీ ప్రాంతాన్ని ఉగ్రవాదంతో ఎలా అల్లాడిస్తాడు అనేది చాలా బాగా చూపించారు… ఇక ఇదంతా చూసే ప్రేక్షకులకు హీరో ఏం చేయకుండా ఖాళీగా ఉండటం తో చిరాకు పుడుతోంది. అన్ని ఆపాల్సిన హీరో వాళ్ళతో కలిసి సైలెంట్ గా ఉండటం ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ అవ్వదు…
ఇక దురంధర్ అనే ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా డీల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పటికి హీరో క్యారెక్టరైజేషన్ కొన్ని విషయాల్లో ఓకే అనిపిస్తోంది. అలాగే ఇంటర్వెల్ వరకు సినిమాలో వచ్చే ఏ సీన్ కి పెద్దగా రియాక్ట్ అవ్వడు. అలాగే సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స్ లో హీరో ఉగ్రవాదుల మీద దాడి చేసి రక్తపాతాన్ని క్రియేట్ చేసే సీన్ బాగుంటుంది…
అలాగే క్లైమాక్స్ కూడా కన్విన్సింగ్ గా ఉంది. రణ్వీర్ సింగ్ రా అండ్ రస్ట్రీక్ క్యారెక్టర్ ను పోషించి మెప్పించాడు. అతని లుక్స్ కూడా బాగున్నాయి…అక్షయ్ ఖన్నా యాక్టింగ్ చాలా మెచ్యుర్డ్ గా ఉంది. మాధవన్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ను సెటిల్డ్ గా చేశాడు… ఇక మ్యూజిక్ ఓకే అనిపించింది… విజువల్స్ బాగున్నాయి. సీన్స్ కి తగ్గట్టుగానే షాట్స్ ను చాలా గ్రాండియర్ గా డిజైన్ చేశారు…
ఈ మూవీ లో బాగున్నవి ఇవే…
రణ్వీర్ సింగ్ యాక్టింగ్…
యాక్షన్ సీక్వెన్సెస్…
క్లైమాక్స్ ఎపిసోడ్…
బాగోలేనివి ఇవే…
రన్ టైమ్
ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్…
రేటింగ్ : 2.5/5
స్పై థ్రిల్లర్ మూవీస్ ఇష్టమున్న వాళ్ళు చూడచ్చు వాళ్ళకి నచ్చుతోంది…