Homeఆధ్యాత్మికంToday 5 March 2026 Horoscope: ఈ రాశి ఉద్యోగులు ఈరోజు జాగ్రత్త.. ఈ విషయంలో...

Today 5 March 2026 Horoscope: ఈ రాశి ఉద్యోగులు ఈరోజు జాగ్రత్త.. ఈ విషయంలో నిర్లక్ష్యం వద్దు..

Today 5 March 2026 Horoscope: జ్యోతిష శాస్త్ర ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉండనుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెడతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు అందుకు సంబంధించిన ఏర్పాటు చేసుకుంటారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులను నియంత్రించాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండటంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి ఉద్యోగులు కొత్తగా ప్రాజెక్టులను చేపడతారు. వీరికి అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న సమయంలో వాటిని పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. నీతో అధిక లాభాలు పొందుతారు. కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు ఆకర్షణకంగా ధన లాభం ఉండనుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. స్నేహితులతో కలిసి ఉయ్యాల యాత్రలకు వెళ్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడంతో మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. నిరుద్యోగులు శుభవార్తను వింటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : విద్యార్థులు పోటీపరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. ఎంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని సానుకూల ఫలితాలు ఉంటాయి. దీంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. పొదుపుపై ఆలోచన చేయాలి. శక్తి సామర్థ్యాల మేరకు మాత్రమే పనులు చేయాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు తోటి వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయం అవుతారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు అధిక లాభాలు పొందుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు అధికంగా లాభాలు సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా పెట్టుబడును పెడతారు. ఇవి భవిష్యత్తులో మంచి లాభాలు ఇవ్వరున్నాయి. పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పెద్దల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. జీవిత భాగస్వామితో కలిసి వ్యాద యాత్రలకు వెళ్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణం చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగులు కొత్త ప్రణాళికలు వేస్తారు. వీటి ప్రకారంగా చేసే పనులు సకాలంలో పూర్తి అవుతాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు అధికంగా ఖర్చులు చేస్తారు. దుబార ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పూర్వీకుల ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు. వీటిని పరిష్కరించుకునేందుకు మార్గం ఏర్పడుతుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. తల్లిదండ్రుల ఆశీస్సులతో విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular