Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి ఆదాయం రెట్టింపు కానుంది.. మరికొన్ని రాశుల వారు అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించాలి. పిల్లల కెరీర్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇదే మంచి సమయం. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటమే మంచిది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు ఆగిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ విషయంలో శుభవార్తలు అందుతాయి. ప్రాజెక్టు పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. ఉద్యోగులను నైపుణ్య ప్రదర్శనతో పదోన్నతులు పొందుతారు. అయితే కొన్ని విషయాల్లో ఓపికతో వ్యవహరించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి రోహన్
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడును పెడతారు. ఉద్యోగులకు అనుకొని ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తోటి వారి సహకారం ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులకు వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి ఆదాయం ఈరోజు గణనీయంగా పెరుగుతుంది. పిల్లల కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతును పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడానికి తోటి వారి సహాయం తీసుకుంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో ధైర్య సాహసాలు చూపిస్తారు. దీంతో సమాజంలో గౌరవం లభిస్తుంది.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని పనులకు అడ్డంకులు ఎదురవుతాయి. అయినా వాటిని అధిగమించుకుంటూ ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. ఎవరికి తొందరపడి వాగ్దానాలు ఇవ్వకూడదు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుగుణ పనులను పూర్తి చేయడానికి కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటారు. గతంలో ఉన్న విభేదాలనుంచి బయటపడతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండటమే మంచిది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు అనవసరపు వివాదాల్లోకి తల దూర్చకుండా ఉండాలి. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం మెరుగుపడుతుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఏవైనా పొరపాటు చేస్తే వెంటనే సరిదిద్దుకుంటారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉండడంతో ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు తెలివితేటలు ప్రదర్శించడంతో పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో ఆదాయం గననీయంగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అనవసరంగా ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగులు ప్రశంసలు పొందుతారు. స్నేహితులతో కలిసి విహారయాతులకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ప్రభుత్వ పనులను వెంటనే పూర్తి చేసుకోవడానికి ఇతరుల సహకారం తీసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అనేక రంగాల్లో విజయం వరిస్తుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. విద్యార్థుల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. వ్యాపారులకు అదృష్టం వరించి అనుకోకుండా లాభాలు వస్తాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. గతంలో కోల్పోయిన డబ్బులు ఇప్పుడు పొందుతారు. కొత్త విషయాలు తెలుసుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ఏదైనా పనిని ప్రారంభించేముందు పెద్దల సహకారం తీసుకోవాలి. అనవసరపు వాదనలకు దూరంగా ఉండటమే మంచిది.







