Today 16 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఏరోజు గణనీయమైన ఆదాయం పెరుగుతుంది. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే అన్ని కలిసి వస్తాయి. ఖర్చులు విషయంలో జాగ్రత్తగా ఉండి పొదుపును అలవాటు చేసుకోవాలి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి ఆదాయంలో గణనీయమైన మార్పులు ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఈరోజు అంతా చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు చాలా రంగాల్లో రాణిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. విలాసాలకు ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. అనుకోకుండా ధన లాభం ఉండే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక మార్గాలు ఏర్పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈరోజు అనుకోకుండా లాభాలు ఉంటాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త అవకాశాలను పొందుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో సంతోషంగా గడుపుతారు. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తోటి వారి సహాయం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధికంగా లాభాలు ఉంటాయి. శత్రువులపై విజయం సాధించడానికి మార్గం ఏర్పడుతుంది. చేపట్టిన ప్రణాళికల ద్వారా ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. పొదుపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. పొదుపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు ఆగిపోయిన డబ్బును వసూలు చేసుకుంటారు. ఉద్యోగులకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పలిస్తాయి. మాటలా మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు అదరపు ఆదాయాన్ని పొందుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచించాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మికంగా ధన లాభం ఉండే అవకాశం ఉంది. వ్యాపారులు మెరుగైన లాభాలు సాధిస్తారు. శక్తి సామర్థ్యాల మేరకే ఖర్చులు చేయాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఇతరులను సంప్రదించాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. స్నేహితులతో సంతోషంగా ఉంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
