https://oktelugu.com/

Somvati Amavasya 2024: రేపే సోమావతి అమావాస్య.. ఇలా ఇంట్లో పూజిస్తే మంచి జరగడం తథ్యం

హిందూ శాస్త్రంలో ప్రతీ తిథికి ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా అమావాస్య తిథిని అయితే బాగా పాటిస్తారు. ఆ రోజు తప్పకుండా ఇంట్లో పూజ చేస్తారు. సాధారణంగా నెలకు ఒక అమావాస్య వస్తుంది. ఇలా నెలకు ఒకసారి వచ్చే అమావాస్యలో కొన్ని ప్రత్యేకమైన అమావాస్యలు ఉంటాయి. అందులో సోమావతి అమావాస్య ఒకటి. ఎంతో పవిత్రమైన సోమావతి అమావాస్య రేపు రానుంది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 29, 2024 / 06:31 PM IST

    Somavathi Amavasya

    Follow us on

    Somvati Amavasya 2024: హిందూ శాస్త్రంలో ప్రతీ తిథికి ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా అమావాస్య తిథిని అయితే బాగా పాటిస్తారు. ఆ రోజు తప్పకుండా ఇంట్లో పూజ చేస్తారు. సాధారణంగా నెలకు ఒక అమావాస్య వస్తుంది. ఇలా నెలకు ఒకసారి వచ్చే అమావాస్యలో కొన్ని ప్రత్యేకమైన అమావాస్యలు ఉంటాయి. అందులో సోమావతి అమావాస్య ఒకటి. ఎంతో పవిత్రమైన సోమావతి అమావాస్య రేపు రానుంది. ఈ అమావాస్య రోజు శివుని ఆరాధిస్తూ.. పూజిస్తే ఇంట్లో ఉన్న అశాంతి, దారిద్య్ర బాధలు అన్ని పోతాయని పండితులు అంటున్నారు. ఈ అమావాస్య చాలా అరుదైనదని, ఈ రోజు పూజిస్తే ఇంట్లో అంతా మంచే జరుగుతుందని పండితులు అంటున్నారు. అయితే సాధారణంగా ప్రతీ నెల ఒక అమావాస్య వస్తుంది. అదే అమావాస్య సోమవారం రోజు వస్తే దాన్ని సోమావతి అమావాస్య అని అంటారు. ఈ అమావాస్యకు ఎంతో పవిత్రత ఉంది. ఈ రోజున పూజిస్తే అన్ని బాధలు తొలగిపోతాయి. మరి ఈ సోమావతి అమావాస్య రోజు ఎలా పూజించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    ఈ సోమావతి అమావాస్యను రేపు జరుపుకోనున్నారు. డిసెంబర్ 30వ తేదీ సోమవారం తెల్లవారు జామున 5 గంటల నుంచి ఆ తర్వాత రోజు తెల్లవారు జామున 3 గంటల వరకు సోమావతి అమావాస్య ఉంటుంది. అయితే అందరూ కూడా రేపే సోమావతి అమావాస్యను జరుపుకోవాలని పండితులు అంటున్నారు. సోమావతి అమావాస్య పూజను ఉదయం సమయంలో చేయడానికి వీలు కాని వారు సాయంత్రం చేసుకోవచ్చు. ఉదయం 5 గంటల నుంచి 7:30, రాత్రి 9 గంటల నుంచి 10:30 గంట లోపు అయిన పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. ఈ రెండు సమయాలు కూడా కానీ వారు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపు అయిన పూజ చేసుకోవచ్చని పండితులు అంటున్నారు.

    ఈ సోమావతి అమావాస్య పూజను చాలా నిష్టతో చేయాలి. నదిలో స్నానం చేసి శివున్ని పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత గోవులకు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఈ అమావాస్య రోజు ఎక్కువగా పెద్దలకు పిండం పెడుతుంటారు. అలాగే పెద్దలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల పెద్దల ఆశీస్సులు అందుతాయని భావిస్తారు. ఈ సోమావతి అమావాస్య రోజు శివునితో పాటు రావి చెట్టుకు, మహా విష్ణువును కూడా పూజించాలి. ఇలా చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే దరిద్రాలు అన్ని కూడా పోతాయి. బ్రాహ్మణులకు దానం ఇస్తే మంచిది. ముఖ్యంగా అన్నదానం చేస్తే సకల పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.