Homeఆధ్యాత్మికంLunar Eclipse in India date and time: భారతదేశంలో చంద్రగ్రహణం ఎప్పుడు? ఎలాంటి జాగ్రత్తలు...

Lunar Eclipse in India date and time: భారతదేశంలో చంద్రగ్రహణం ఎప్పుడు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Lunar Eclipse in India date and time: భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళరేఖపై వచ్చినప్పుడు జరిగే ఖగోళ సంఘటన చంద్రగ్రహణం. సూర్యుడి నుంచి వచ్చే కాంతిని భూమి అడ్డుకుంటుంది. ఆ నీడ చంద్రుడు పై పడుతుంది. దీంతో పౌర్ణమి రోజున చీకటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. ప్రతి ఏడాది రెండుసార్లు చంద్రగ్రహణం చూడవచ్చు. 2026 సంవత్సరంలో మొత్తం రెండు చంద్రగ్రహణాలు సంభవిస్తాయి. వీటిలో ఒకటి మార్చి 3 న సంపూర్ణ చంద్రగ్రహణం ఉండనుంది. మరొకటి ఆగస్టు 28న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే మార్చి 3 న ఏర్పడే చంద్రగ్రహణం భారత్ లో ఎక్కడ కనిపిస్తుంది? ఇది ఎప్పుడు ఏర్పడుతుంది?

భారతదేశంలో గ్రహణాలను ప్రత్యేకంగా చూస్తారు. సైన్స్ పరంగా కాకుండా ఆధ్యాత్మికంగా దీనిని భావించి గ్రహణ సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకుండా ఉంటారు. ముఖ్యంగా గర్భిణీలు వంటి వారు ఈ గ్రహణ సమయంలో ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకూడదని చెబుతారు. అందువల్ల భారతదేశంలో గ్రహణ సమయం గురించి తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. 2026 మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈరోజు నా మధ్యాహ్నం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.48 గంటలకు ముగుస్తుంది. ఇందులో సంపూర్ణ గ్రహణ దశ సాయంత్రం 4.34 నుంచి 5.33 వరకు ఉంటుంది. అంటే సుమారు 27 నిమిషాల పాటు గ్రహణం దర్శనమిస్తుంది.

భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో గ్రహణంను చూడవచ్చు. అయితే ఆయా ప్రాంతాల్లో విభిన్నంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తోపాటు ఉత్తర భారత దేశంలో సాయంత్రం తర్వాత గ్రహణం ముగుస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువసేపు గ్రహణం ఉండనుంది. గ్రహణ సమయంలో బయటకు రావద్దని.. గ్రహాన్ని చూడడం వల్ల కళ్ళకు సమస్యలు వస్తాయని కొందరు చెబుతారు. కానీ సైన్సును నమ్మేవారు మాత్రం గ్రహాన్ని చూడవచ్చని అంటారు. అయితే నేరుగా కాకుండా చంద్రగ్రహణం కళ్ళజోడుతో చూడడం సురక్షితమని అంటున్నారు. లేదా టెలిస్కోపుతో చూస్తే చంద్రుడి రంగు మరింత స్పష్టంగా కనిపిస్తుందని తెలుపుతారు.

అయితే ఆధ్యాత్మిక ప్రకారం గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారు. గ్రహణం పూర్తయిన తర్వాత ఆలయాలను సంప్రోక్షణ ద్వారా శుద్ధి చేస్తారు. కొందరు గ్రహణ సమయంలో ఇలాంటి ఆహార, పానీయాలు తీసుకోకుండా నిరాహారంగా ఉంటారు. ముఖ్యంగా గర్భిణీలు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండాలని చెబుతారు. గ్రహణ సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదని చెబుతారు. కేవలం దైవ నామ స్మరణం చేయడమే మంచిదని అంటుంటారు. గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేయడం మంచిదని అంటూ ఉంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version