Site icon OkTelugu

Suryakumar Yadav, Sanju Samson : సంజు శాంసన్ కోసం గేట్ కీపర్ గా సూర్య కుమార్ యాదవ్

sanju-samson--suryakumar-yadav-0

Suryakumar Yadav, Sanju Samson : అప్పటిదాకా మన మీద విమర్శలు చేసిన వారు.. అప్పటి దాకా మనమీద రాళ్లు వేసిన వారు.. ఒకసారి సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే మనం విజయం సాధిస్తే.. అందరి నోర్లు మూతబడతాయి. ఇప్పుడు టీమిండియా ఆటగాడు సంజు శాంసన్ కూడా పై ఉపోద్ఘాతం లాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. టీమిండియాలో మొన్నటిదాకా చోటు కోసం ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఎవరైతే తనను విమర్శించారో.. ఎవరైతే తనకు జట్టులో చోటు ఎందుకు అని ప్రశ్నించారో.. వారితోనే ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఆదివారం నాటి వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 97* పరుగులు చేసిన అతడు.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియా భారాన్ని మొత్తం ఒక్కడే మోసాడు. అద్భుతమైన విజయాన్ని అందించాడు. తద్వారా టీమిండియా సెమీ ఫైనల్ వెళ్లడానికి మార్గం సుగమం చేశాడు. టీమిండియాలో ఉన్న గొప్ప గొప్ప ప్లేయర్లు చేతులు ఎత్తేసిన వేళ.. సంజు శాంసన్ మాత్రమే గట్టిగా నిలబడ్డాడు. ఓపెనర్ గా వచ్చిన అతడు.. చివరిదాకా బ్యాటింగ్ చేశాడు. టీమ్ ఇండియాను గెలిపించి వెళ్లిపోయాడు.

సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత.. అతని గురించి మీడియాలో విస్తృతంగా కథనాలు ప్రసారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంజు శాంసన్ కు మైదానంలోనే సూర్యకుమార్ యాదవ్ టేక్ ఏ బౌ అన్నట్టుగా తల మీద నుంచి టోపీ తీసి సెల్యూట్ కొట్టాడు. అంతేకాదు.. అతడిని గట్టిగా హాగ్ చేసుకుని.. సూపర్ ఇన్నింగ్స్ బాస్ అంటూ కితాబు ఇచ్చాడు.

ఇంతటితోనే సూర్య కుమార్ యాదవ్ ఆగిపోలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత.. జట్టు సభ్యులు హోటల్ వెళ్తుంటే సూర్య కుమార్ యాదవ్ గేట్ కీపర్ అవతారం ఎత్తాడు. సంజు శాంసన్ కు ముందుండి స్వాగతం పలికాడు. అంతేకాదు అతడికి ఎస్కార్ట్ మాదిరిగా వ్యవహరించాడు. సంజు శాంసన్ ను ఎవరూ చుట్టుముట్టకుండా కాపలా కాస్తున్నట్టుగా హడావిడి చేశాడు.. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

“మన వైఫల్యాలు చాలా ఇబ్బంది పడతాయి. చాలామందిలో చులకన చేస్తాయి. సంజు శాంసన్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. చివరికి తన లోపాలపై దృష్టి సారించాడు. బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా దుమ్ము రేపే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. చివరికి టీమ్ ఇండియాను గెలిపించాడు. పెద్ద పెద్ద బ్యాటర్లు మొత్తం విఫలమైనచోట అతడు మాత్రం నిలబడ్డాడు. ఫలితంగా టీం ఇండియా గెలిచింది. సంజు శాంసన్ ఆ స్థాయిలో ఆడటం వలనే ఇదిగో ఈ స్థాయిలో గుర్తింపు లభించిందని” సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు.

Exit mobile version