Site icon OkTelugu

Toxic movie overseas bookings : నిరాశపరుస్తున్న ‘టాక్సిక్’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్.. మరీ ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు!

Toxic Movie Teaser Review

Toxic Movie Teaser Review

Toxic movie overseas bookings : ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న చిత్రాల్లో ఒకటి ‘టాక్సిక్'(Toxic movie). కేజీఎఫ్ సిరీస్ తర్వాత కన్నడ సూపర్ స్టార్ యాష్(Rocking Star Yash) నుండి వస్తున్న సినిమా ఇది. ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ రెండవ టీజర్ కి మాత్రం అత్యంత దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో అర్థం పర్థం లేని వయొలెన్స్ తప్ప, కంటెంట్ లేనట్టు ఉంది, చూస్తుంటే ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేలా ఉందంటూ చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. ఆ ప్రభావం ఓవర్సీస్ టికెట్ సేల్స్ మీద కూడా చాలా గట్టిగానే పడిందని తెలుస్తోంది. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించారు.

81 లొకేషన్స్ లో 122 షోస్ షెడ్యూల్ చేస్తే , కేవలం 189 టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయి. గ్రాస్ వసూళ్లు కేవలం $3665 డాలర్లు మాత్రమే వచ్చింది. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించినప్పుడు 173 టికెట్స్ అమ్ముడుపోగా, రెండవ రోజు అది 189 కి చేరింది. అంటే కేవలం 16 టికెట్స్ మాత్రమే పెరిగాయి అన్నమాట. ఇంత తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ ఈమధ్య కాలం లో ఏ పాన్ ఇండియన్ సినిమాకు కూడా జరగలేదు. సినిమా విడుదలకు సరిగ్గా 16 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే 2 లక్షల డాలర్ల గ్రాస్ అయినా ప్రీమియర్ షోస్ నుండి వస్తాయా అనే అనుమానం కలుగుతింది . ఇంత తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడానికి పలు కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం ఇది కన్నడ చిత్రం అవ్వడమే. కన్నడ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ చాలా అంటే చాలా తక్కువ.

‘కాంతారా 2’ లాంటి సినిమాకే ప్రీమియర్ షోస్ నుండి 3 లక్షల డాలర్లు మాత్రమే వచ్చింది. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు, ఎంత తక్కువ అనేది. అంత మంచి హైప్ ఉన్న సినిమాకే ఇంత తక్కువ వచ్చిందంటే, ఇక టాక్సిక్ ఎంత చెప్పండి? ..కాంతారా 2 కి వచ్చిన ఆ మూడు లక్షల డాలర్ల గ్రాస్ కూడా తెలుగు ఆడియన్స్ వల్లే. ఇప్పుడు ఈ చిత్రానికి కూడా ఎంత గ్రాస్ వచ్చినా తెలుగు ఆడియన్స్ వల్లే రావాలి, లేదంటే లక్ష డాలర్ల గ్రాస్ కూడా ప్రీమియర్ షోస్ నుండి నమోదయ్యే అవకాశాలు కనిపించడం లేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతుంది. కనీసం ఈ ట్రైలర్ అయినా సినిమా మీద బజ్ పెంచుతుందో లేదో చూడాలి.

Exit mobile version