కొత్త ఏడాది వచ్చేస్తుంది. కేవలం సంవత్సరంతో పాటు ఆర్థిక విషయాల్లో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా కొన్ని వస్తువులపై ధరలు కూడా పెరగనున్నాయి. ఇవి సామాన్య ప్రజలపై తప్పకుండా ప్రభావం చూపనున్నాయి. కొన్ని మార్పులు ప్రజలకు అనుకూలంగా ఉంటే మరికొన్ని వ్యతిరేకంగా ఉంటాయి. నిజం చెప్పాలంటే ప్రజలకు అనుకూలంగా, ఉపయోగపడే విధంగా కాకుండా వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టే విధంగానే ఎక్కువ మార్పులు ఉంటాయి. ఎన్ని మార్పులు వచ్చిన కూడా ఇబ్బంది పడేది మాత్రం సామాన్య మనుషులే. ఇదంతా పక్కన పెడితే మరి వచ్చే ఏడాదిలో వచ్చే మార్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం.
వాట్సాప్ నిలిపివేత
పాత స్మార్ట్‌ఫోన్లలో వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ పనిచేయదు. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 3, మోటో జీ, హెచ్‌టీసీ వన్‌ఎక్స్, మోటో రేజర్ హెచ్‌డీ, ఎల్‌జీ ఆప్టిమస్ జీ వంటి మొబైల్స్‌లో వాట్సాప్ పనిచేయదు.
అమెజాన్ యూజర్లకు..
ఇప్పటి వరకు అమెజాన్ యూజర్లు ఒకే అకౌంట్‌ను ఒకేసారి ఐదు డివైజ్‌లో అయిన ఉపయోగించుకోవచ్చు. కానీ వచ్చే ఏడాది నుంచి కేవలం ఒకటి లేదా రెండు డివైజ్‌లో ఒకేసారి వాడుకోవాలి. దీంతో ఇంకో డివైజ్‌లో కనెక్ట్ చేయాలంటే మళ్లీ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. దీనివల్ల ఎక్కువగా యూజర్స్ ఇబ్బంది పడతారు. మళ్లీ మళ్లీ ఇంకో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి కాబట్టి.
కార్లు ధరలు
వచ్చే ఏడాది నుంచి కార్లు ధరలు పెరగనున్నాయి. దాదాపుగా అన్ని కంపెనీ కార్లు కూడా వీటి ధరలను పెంచనున్నాయి. మారుతీ సుజుకీ, హోండా ఇండియా, హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్, మెర్సిడెస్, ఆడీ వంటి కార్ల కంపెనీలు ధరలను పెంచనున్నాయి. అలాగే సెకండ్ హ్యాండ్ కార్లపై కూడా ట్యాక్స్ పెరగనుంది.
ఇంటర్నెట్ లేకుండా యూపీఐ
ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ లేకుండా యూపీఐ సేవలు అందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సేవల కోసం యూపీఐ123పే పరిమితిని కూడా వచ్చే ఏడాది నుంచి పెంచనున్నారు. అలాగే బ్యాంకు లిమిట్ కూడా రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచనున్నారు. దీంతో ఒకేసారి పది వేలను పంపించుకోవచ్చు.
గ్యాస్ ధర
ప్రతీ నెల గ్యాస్ ధరల్లో మార్పులు వస్తుంటాయి. అయితే వచ్చే ఏడాది కూడా గ్యాస్ ధరలు పెరగనున్నాయి. అది కూడా కేవలం వాణిజ్య సిలిండర్ ధరలు మాత్రమే పెరగనున్నాయి. గృహ అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ ధరలను మాత్రం పెంచడం లేదు. ఇంతకు ముందు ఏ ధరలు అయితే ఉన్నాయో.. ఇప్పుడు కూడా అవే ధరలు ఉన్నాయి.
రీ షెడ్యూల్
అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారు.. వీసా ఇంటర్వూను ఎలాంటి రుసుము కట్టకుండా రీ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు రీ షెడ్యూల్ చేస్తే తప్పకుండా రీ షెడ్యూల్ చేయాలి. కానీ వచ్చే ఏడాది నుంచి ఎలాంటి డబ్బులు కట్టక్కర్లేదు.