Site icon OkTelugu

The Paradise Aya Share song : 5 రోజుల్లో 1 మిలియన్ లైక్స్.. చరిత్ర తిరగరాసిన ప్యారడైజ్ ‘ఆయా షేర్’ సాంగ్!

Nani Aaya Share Song Hook Step Copy

Nani Aaya Share Song Hook Step Copy

The Paradise Aya Share song : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్'(The Paradise Movie) నుండి రీసెంట్ గా విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ సృష్టించిన సెన్సేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈమధ్య కాలం లో ఏ స్టార్ హీరో సినిమా పాటకు కూడా రానంత రీచ్ ఈ పాటకు వచ్చింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ లో ఆడియన్స్ కి పాట నచ్చింది అనేది. మొదటి రోజే 21 మిలియన్ కి పైగా వ్యూస్ 7 లక్షలకు పైగా లైక్స్ ని సొంతం చేసుకున్న ఈ పాట ఇప్పుడు 43 మిలియన్ వ్యూస్ కి చేరింది. రోజుకు 2 నుండి 3 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఇక లైక్స్ అయితే కేవలం 5 రోజుల్లోనే 1 మిలియన్ మార్కు ని అందుకుంది. ఈమధ్య కాలం లో ఏ స్టార్ హీరోకి కూడా ఇంత వేగంగా 1 మిలియన్ లైక్స్ రాలేదు.

పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల అభిమానులు ఒక్క రోజులో 1 మిలియన్ లైక్స్ కొట్టాలని చూసారు కానీ , పది రోజుల సమయం పట్టేది. కానీ ‘ఆయా షేర్’ పాటకు మాత్రం కేవలం 5 రోజుల సమయం మాత్రమే పట్టింది. మరో పక్క ఈ పాటకు రెండు రోజుల ముందు విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ లోని ‘ఆయా షేర్’ పాటకు వారం రోజులకు కలిపి కేవలం 20 మిలియన్ల వ్యూస్ మాత్రమే వచ్చాయి. లైక్స్ కేవలం 1 లక్షా 64 వేలు మాత్రమే వచ్చింది. నాని లాంటి మీడియం రేంజ్ హీరో సినిమా పాటకు రికార్డు స్థాయి వ్యూస్ , లైక్స్ రావడం, పవన్ కళ్యాణ్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ పాటకు మిశ్రమ ఫలితం రావడం వంటివి చూస్తుంటే , ఆడియన్స్ కంటెంట్ కి ఏ రేంజ్ ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం అవుతోంది.

హీరో ఎవరు అనేది ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు, కేవలం కంటెంట్ మాత్రమే చూస్తున్నారు . ఇలాంటి రోజులు వస్తాయని బహుశా మనం కలలో కూడా ఊహించి ఉండము . ఒకప్పుడు స్టార్ హీరో సినిమాలకు , మీడియం రేంజ్ హీరోల సినిమాలకు మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలిసేది. కానీ ఇప్పుడు అలాంటి తేడా ఏమి కనిపించడం లేదు. కంటెంట్ ప్రధానం అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇప్పటి వరకు ‘ది ప్యారడైజ్ ‘ నుండి వచ్చిన ప్రతీ కంటెంట్ బాంబు లాగా పేలింది. ఇదే జోష్ ని కొనసాగిస్తూ ముందుకు పోతే మాత్రం కచ్చితంగా ఈ సినిమా స్టార్ హీరోల పాన్ ఇండియన్ సినిమాల హైప్ కి ఏ మాత్రం తీసిపోదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది.

Exit mobile version