Sarva pithru Amavasya-2024: పితృ అమావాస్య రోజు సూర్య గ్రహణం ఉన్నందున.. తర్పణం ఉంటుందా? ఏం చేయాలి

ఈ సంవత్సరం (2024) పితురుల (పూర్వీకుల) పండుగ రోజు సూర్య గ్రహణం వస్తుంది. కాబట్టి ఈ రోజు ఏం చేయాలి. ఏఏ నియామాలు పాటించాలో చాలా మందిలో సందేహాలు కలుగుతుంటాయి. అయితే ఇలా చేస్తే..

Written By: Mahi, Updated On : October 1, 2024 11:51 am

Sarva pithru Amavasya-2024

Follow us on

Sarva pithru Amavasya-2024: సనాతన ధర్మంలో పితురులను (పూర్వీకులను) స్మరించుకోవడం, వారికి పిండ ప్రధానం, తర్పణం ఇవ్వడం అనాధిగా వస్తున్న ఆచారం. కానీ ఈ సారి (2024) పితురులకు నైవేద్యం పెట్టే రోజు (పితురు అమావాస్య-పెత్రామాస) వస్తుంది. అదే రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అందువల్ల, ఈ రోజుకు ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఈ సూర్యగ్రహణం దేశంలో కనిపించదు, కాబట్టి దాని సూతక్ చెల్లదు. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం సర్వ పితృ అమావాస్య రోజు జరగబోతోంది. సర్వ పితృ అమావాస్య రోజున పితృదేవతలకు నైవేద్యాలు పెట్టడం ముఖ్యమైన కార్యంగా భావిస్తారు. సర్వ పితృ అమావాస్యను మహాలయ అమావాస్యగా నిర్వహించుకుంటారు. యాదృచ్ఛికంగా, ఈ సంవత్సరం చివరి సూర్య గ్రహణం అక్టోబర్ 2, బుధవారం జరుగుతుంది. కానీ ఈ సూర్య గ్రహణం దేశంలో కనిపించదు. అందువల్ల ఈ గ్రహణం అమావాస్యపై కూడా ప్రభావం చూపదు. ఈ ఏడాది అక్టోబర్ 2న సర్వ పితృ అమావాస్య వస్తుంది. అదే రోజున సూర్యగ్రహణం ఏర్పడనుంది. సర్వ పితృ అమావాస్య అక్టోబర్ 1వ తేదీ (మంగళవారం) రాత్రి 9.39 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 3 (బుధవారం) మధ్యాహ్నం 12.18 గంటలకు ముగుస్తుంది. దీంతో పాటు సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతోంది. దీని ముహూర్తం అక్టోబర్ 2 మధ్యాహ్నం 12.23 నుంచి అక్టోబర్ 3 ఉదయం 6.15 గంటల వరకు ఉంటుంది.

సూర్య గ్రహణం యొక్క వ్యవధి
హస్త నక్షత్రం, కన్యారాశిలో ఈ సూర్యగ్రహణ ఏర్పడనుంది. గ్రహణం దేశంలో కనిపించదు, కాబట్టి ఈ గ్రహణం సూతక్ కాలాన్ని పరిగణనలోకి తీసుకోరు. అయితే ఈ గ్రహణ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది.

ఈ పనులు చేసుకోవచ్చు..
* అమావాస్య రోజున పితృదోషాన్ని, గృహదోషాన్ని తొలగించే పనులు చేసుకోవచ్చు.
* అన్ని పితృ అమావాస్యల్లో సూర్యగ్రహణం సూతక్ ఉండదు, కాబట్టి దానధర్మాలు చేయవచ్చు.
* ఈ రోజున ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి హనుమంతుడిని పూజించాలి.
* అమావాస్య రోజున గంగా, యమున, సరస్వతీ వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయాలనే నియమం ఉంది.

సూర్యగ్రహణం ప్రభావం ఇలా..
ఈ సారి కన్యారాశిలో సూర్యగ్రహణం ఏర్పడుతోంది. గ్రహణ సమయంలో రాహువు సూర్యునిపై పూర్తి దృష్టి సారిస్తాడు. దీంతో పాటు సూర్యుని శని, కేతువుతో కూడిన శని శనక్త యోగం ఏర్పడుతుంది. ఈ గ్రహణంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కేతువుల కలయిక ఏర్పడుతుంది. మీనం, కన్యారాశిలో రాహు, కేతువుల అక్షం ప్రభావం చూపుతుంది.

ఇది సూర్యుడు, కుజుడు, కేతువుల ప్రభావంగా మారింది. ఈ పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా భయంకరమైన రాజకీయ ప్రకంపనలకు కారణమవుతుంది. స్టాక్ మార్కెట్ ను ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితిని కుదిపేయవచ్చు. కన్య, మీన రాశి ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాన్ని, ప్రకృతి వైపరీత్యాలను సూచిస్తుంది.

ఈ సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది
ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం భారత్ లో కనిపించదు. కానీ, అర్జెంటీనా, పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా, దక్షిణ అమెరికా, పెరూ, ఫిజీ వంటి ప్రదేశాల్లో కనిపిస్తుంది.