Homeజాతీయ వార్తలుHPV vaccine for girls mandatory: బాలికలకు ఈ టీకా కంపల్సరీ వేయించాలా..సురక్షితమేనా?

HPV vaccine for girls mandatory: బాలికలకు ఈ టీకా కంపల్సరీ వేయించాలా..సురక్షితమేనా?

HPV vaccine for girls mandatory: దేశంలో ఏటా క్యాన్సర్‌ బాధితులు పెరుగుతున్నారు. మహిళల్లో ఎక్కువగా గర్భాశయ ముఖద్వారా క్యాన్సన్‌ ఎక్కువగా సోకుతోంది. దీనిని అరికటేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ఉచిత HPV వ్యాక్సినేషన్‌ పంపిణీ చేయాలని నిర్ణయిచింది. అయితే దీనిపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ టీకా సురక్షితం కాదని కొందరు ప్రచారం చేస్తున్నారు. దీంతో కేంద్రం స్పందించింది. తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. ఈ టీకా 2006 నుండి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉందని, 50 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని స్పష్టం చేసింది. అధ్యయనాలు దీని సురక్షితమని ధ్రువీకరించాయని వెల్లడించింది. గర్భాశయ క్యాన్సర్‌ నుంచి 93–100% రక్షణ ఇస్తుందని వెల్లడించింది.

టీకా చరిత్ర..
HPV(హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌) 200కి పైగా రకాలు కలిగి, 16, 18 రకాలు గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారకాలను నియంత్రిస్తుంది. గార్డాసిల్, సెర్వారిక్స్‌ వంటి టీకాలు 2006లో అమెరికాలో, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందాయి. ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో క్యాన్సర్‌ కేసులు 90% తగ్గాయి. భారత్‌లో 2026 నుంచి ఉచిత పంపిణీకి కేంద్రం శ్రీకారం చుట్టింది. 14 ఏళ్లలోపు బాలికలకు ప్రాధాన్యత ఇస్తోంది.

ఎవరికి అనుకూలం..
9–14 ఏళ్లలోపు బాలికలకు 2 డోసులు(0, 6 నెలలు), 15–45 ఏళ్లలోపు వారు 3 డోసులు (0, 2, 6 నెలలు) తీసుకోవాలి. లైంగిక చురుకుదల మొదలుకునే ముందు వేయడం ఉత్తమం, జీవితాంతం రోగనిరోధక శక్తి కల్పిస్తుంది. అబ్బాయిలకు కూడా ఉపయోగకరమే. గర్భిణులు మినహా అందరూ తీసుకోవచ్చు.

సైడ్‌ ఎఫెక్ట్స్, జాగ్రత్తలు
సాధారణంగా ఇంజెక్షన్‌ స్థలంలో నొప్పి, జ్వరం, తలనొప్పి వంటివి 1–2 రోజులు ఉంటాయి. తీవ్ర దుష్ప్రభావాలు అరుదు. పెద్ద ఎత్తున అధ్యయనాలు సురక్షితమని నిర్ధారించాయి. టీకా తర్వాత స్క్రీనింగ్‌ టెస్టులు(పాప్‌ స్మియర్‌) కొనసాగాలి, ఎందుకంటే అన్ని HPV రకాలను కవర్‌ చేయదు. ఈ టీకా గర్భాశయ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించే అవకాశం ఉంది. భారత్‌లో ఏటా 1.2 లక్షల కేసులను తగ్గిస్తుంది. తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోకుండా పిల్లలకు వేయించడం మంచిదని కేంద్రం తెలిపింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Gen Z Protests : జెన్ జీ ఆందోళన నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలేంటి?

Gen Z Protests : దేశ రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో విద్యార్థి ఉద్యమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. చరిత్ర చెబుతున్నదేమిటంటే.. యువత ముందుకు వస్తే మార్పు సాధ్యమవుతుంది. అయితే అదే యువత ఆవేశానికి,...

Vivo T5e: అధికారికంగా రిలీజ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర రూ.14 వేల లోపే..

Vivo T5e: ప్రస్తుత కాలంలో బడ్జెట్ లో మొబైల్ కొనేవారు చాలా మందే ఉన్నారు. ఓ వైపు ప్రీమియం మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ దీనిపై ఎక్కువ డబ్బు పెట్టలేని వారికోసం Vivo...

Narendra Modi And Rahul Gandhi: మోడీ గేమ్ అర్థం కాలేదా రాహుల్ గాంధీ…

Narendra Modi And Rahul Gandhi: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… ఈ పరిణామాలను చూసి విపక్షాలు...

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...
Oktelugu Epaper
Exit mobile version