Homeఆంధ్రప్రదేశ్‌AP govt decision on Iran Israel war: ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం.. ఏపీ ప్రభుత్వం...

AP govt decision on Iran Israel war: ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

AP govt decision on Iran Israel war: ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దాని ప్రభావం ఏపీలో( Andhra Pradesh) కనిపిస్తుంది. తాజాగా ఇప్పుడు ఇరాన్ తో ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఇరాన్ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న తెలుగువారి యోగక్షమలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు వీలుగా ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. తెలుగు ప్రజల కోసం ఫోన్ నెంబర్, వాట్సాప్ నంబర్, ఈమెయిల్ ఐడి అందుబాటులో ఉంచింది. తెలుగు ప్రజలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్లు ఎన్నారై సంబంధిత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

ప్రత్యేక కంట్రోల్ రూమ్..
గల్ఫ్ దేశాలపై( Gulf countries) యుద్ధ ప్రయోగం చేస్తోంది ఇరాన్. ఇజ్రాయిల్ తో యుద్ధం నేపథ్యంలో.. అమెరికా ఆర్థిక మూలాలైన గల్ఫ్ దేశాలపై దృష్టి పెట్టింది ఇరాన్. యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అయితే పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు తమ వివరాలను ఏపీఎన్ఆర్ టీఎస్ హెల్ప్ లైన్ నెంబర్ 0863-2340678 ఫోన్ నెంబర్ కు సంప్రదించవచ్చు. మరోవైపు + 918500027678 వాట్సాప్ నెంబర్ లో కూడా తమ పరిస్థితిని తెలియజేయవచ్చు. ఇంకోవైపు helpline@apnrts.com ఈ మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. తగిన సాయం పొందవచ్చు.

ఎయిర్ పోర్ట్ లలో వసతి..
యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో విమాన రాకపోకలు నిలిపివేశారు. ఎయిర్పోర్టులలో( airports ) ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ కోఆర్డినేటర్ల ద్వారా అక్కడ చిక్కుకున్న వారికి వసతి ఏర్పాట్లు చేస్తోంది. గల్ఫ్ దేశాలలో ఉన్న తెలుగు ప్రజలు స్థానికంగా ఉన్న ఇండియన్ ఎంబసీ సేవలను.. ఏపీ ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లను ఉపయోగించుకోవాలని సూచిస్తోంది ఏపీ ప్రభుత్వం. అయితే ఒక్క బెహ్రయిన్ లోనే దాదాపు 50 వేల మందికి పైగా తెలుగు వారు ఉన్నట్లు తెలుస్తోంది. వారందరి కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Narendra Modi And Rahul Gandhi: మోడీ గేమ్ అర్థం కాలేదా రాహుల్ గాంధీ…

Narendra Modi And Rahul Gandhi: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… ఈ పరిణామాలను చూసి విపక్షాలు...

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...
Oktelugu Epaper
Exit mobile version