Mobile Phones: ప్రస్తుత కాలంలో మొబైల్ లేని వారు దొరకడం చాలా కష్టం అని చెప్పాలి. కొందరు విద్యార్థులు సైతం స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారు. అయితే మొబైల్ విప్లవం తరువాత డెవలప్మెంట్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఏ విషయాన్నైనా మొబైల్ ద్వారా తెలుసుకుంటున్నారు. దీంతో కొన్ని పనులు ఈజీ అవుతున్నాయి. అయితే చాలా మంది ఈ మాయలో పడి కంటినిండా నిద్రకు దూరమవుతున్నారు. ఎక్కువగా ఫోన్ చూడటం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. 19 నుంచి 40 ఏళ్ల లోపు వారు కనీసం 6 నుంచి 7 గంటలు నిద్రించాలి. కానీ అలా జరగడం లేదు. దీంతో సంతాన లేమి సమస్య ఎదురవుతున్నట్లు ఓ సర్వే బయటపెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ వాడకం ఎక్కువైంది. ఏ పని చేయాలన్నా మొబైల్ తప్పనిసరి అయింది. ఉదయం లేచిందగ్గర నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఫోన్ తోనే కాలం గడుపుతున్నారు. అయితే ఎక్కువగా ఫోన్ వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. మొబైల్ యూజ్ ఎక్కువగా కావడంతో ముందుగా స్ట్రెస్ వస్తుంది. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఆ తరువాత మానసిక ఆందోళనతో ఉంటున్నారు. దీంతో ప్రశాంతతను కోల్పోయిన మంచి నిద్ర పోలేకపోతున్నారు. మనిషికి సరైన నిద్ర లేకపోవడంతో డయాబెటీస్ నుంచి గుండె జబ్బుల వంటి దీర్ఘకాల వ్యాధులు సంక్రమిస్తాయి.
తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశంలో 61 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి కారణంగా మానసిక ఒత్తిడి మాత్రమే కాకుండా మనిషి నరాలపై ప్రభావం చూపుతుందట. దీంతో ఫెర్టిలిలీ సమస్యను ఎదుర్కొంటారు. ఇదిలాగే కొనసాగితే సంతానోత్పత్తికి దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల కచ్చితంగా 6 నుంచి 7 గంటల నిద్ర పోవాలని సూచిస్తున్నారు. కానీ ఒక్కోసారి కొన్ని పనుల కారణంగా సరైన నిద్ర పోవడం లేదు. దీంతో కొన్ని చిన్నపాటి వ్యాయామాల ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
ప్రతిరోజూ బ్రీత్ ఎక్సర్ సైజ్ చేయాలి. అలాగే వాకింగ్ మస్ట్ గా అలవాటు చేసుకోవాలి. చాలా వరకు మొబైల్ స్క్రీన్ కు దూరంగా ఉండండి. అవసరం అయితేనే మొబైల్ వాడాలి. ముఖ్యంగా ఇంటర్నెట్ ఉపయోగించడం తగ్గించుకోవాలి. రాత్రిళ్లు పడుకునే ముందు మొబైల్ చూడడం తగ్గించుకోవాలి. ఉదయం మొబైల్ చూడడం కంటే రాత్రి పడుకునే ముందు చూడడం చాలా డేంజర్. ఇది నరాలపై ఎఫెక్ట్ పడుతుంది. ఫలితంగా ఫెర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటారు.
నిద్రలేమి సమస్యతో బాధపడే వారు చాలా వరకు లైట్ ఫుడ్ తీసుకోవడం మంచిది. హెవీ ఫుడ్ వల్ల ఓబెసిటీ పెరిగిపోతుంది. దీంతో గుండె సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే డయాబెటిక్ బారిన పడుతారు. సరైన నిద్ర లేకపోవడం వల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. మంచి నిద్ర పోవడం వల్ల మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దీంతో ఆలోచనలను సక్రమంగా ఉంటాయి. నిద్రలేమి కారణంగా మతిమరుపు ఎక్కువగా వస్తుంది. చాలా మంది చిన్న వయసులోనే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.